శాది ముభారక్, కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి , కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్…..
పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక సహాయం అందించే పథకం కళ్యాణ లక్ష్మి, షాది ముభారాక్ చెక్కులను ఉదయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి , కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్
లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా పటాన్చెరువులోని 50 మంది లబ్ధిదారులకు 50 లక్షల రూపాయల విలువైన చెక్కులను కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేయడం జరిగింది.