చిలకలూరిపేట రాజకీయాలపై చర్చ
జనసేన ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్ తో యువ నాయకులు మండలనేని చరణ్ తేజ భేటీ
జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయం మంగళగిరిలో పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్ ని చిలకలూరిపేట నియోజకవర్గ యువ నాయకులు మండలనేని చరణ్ తేజ మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా, చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలు, మరియు యువతను పార్టీ కార్యక్రమాల్లో మరింత క్రియాశీలంగా భాగస్వామ్యం చేయడం వంటి అంశాలపై వారు ప్రధానంగా చర్చించారు.యువ నాయకులు చరణ్ తేజ నియోజకవర్గంలోని తాజా రాజకీయ పరిణామాలను, ప్రజల సమస్యలను తాళ్లూరి రామ్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. నియోజకవర్గంలో పార్టీ సంస్థాగత నిర్మాణం, భవిష్యత్తు కార్యాచరణపై కూడా వీరిద్దరూ చర్చించినట్లు తెలుస్తోంది.ఈ భేటీ చిలకలూరిపేట జనసేన పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపిందని, రానున్న రోజుల్లో నియోజకవర్గంలో పార్టీ మరింత వేగం పుంజుకునే అవకాశం ఉందని రాజకీయవిశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
