గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
సునిత రెడ్డి
సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతలపై కఠిన పర్యవేక్షణ
జిల్లావ్యాప్తంగా బందోబస్తు పటిష్ఠం – సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు
శాంతిభద్రతల విషయంలో ఎలాంటి రాజీ లేదు కఠినంగా వ్యవహారిస్తాం
సాక్షిత వనపర్తి :
గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల మొదటి విడత నామినేషన్ల దృష్ట్యా గోపాల్ పేట్, మండలంలోని గోపాల్ పేట్, తాడిపత్రి, గ్రామపంచాయతీలు మరియు ఎదుల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎదుల గ్రామపంచాయతీలో ఏర్పాటు చేసిన నామినేషన్ , పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ *సునిత రెడ్డి, ఆకస్మికంగా పరిశీలించారు.
నామినేషన్ కేంద్రాల్లో విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందితో ఎస్పీ ప్రత్యేకంగా మాట్లాడి, ఎన్నికల నియమావళి ప్రకారం నామినేషన్ ప్రక్రియ పూర్తిగా నిష్పక్షపాతంగా, శాంతియుతంగా జరుగేలా పనిచేయాలని పలు సూచనలు చేశారు. ఎలాంటి అవాంఛిత పరిస్థితులు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు పారదర్శకమైన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ప్రతి సిబ్బందిపైన ఉందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…
ఎన్నికలలో శాంతిభద్రతలను కాపాడటంలో ఎలాంటి రాజీ ఉండదనీ. ఎన్నికల ప్రక్రియను భంగపరచాలని చూస్తే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవుఅని స్పష్టం చేశారు.
జిల్లాలోని సెన్సిటివ్ గ్రామాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, ప్రతి పోలింగ్ కేంద్రంలో పకడ్బందీ బందోబస్తు, పేట్రోలింగ్, క్విక్ రెస్పాన్స్ టీంలను సిద్ధంగా ఉంచినట్లు ఎస్పీ తెలిపారు. అక్రమ డబ్బు, మద్యం పంపిణీ, బెదిరింపులు, అనైతిక ప్రలోభాలు వంటి తప్పిదాలు ఎక్కడైనా గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో వనపర్తి డిఎస్పి, వెంకటేశ్వర్ రావు, వనపర్తి సిఐ కృష్ణయ్య గోపాల్పేట్ ఎస్సై, నరేష్, రేవల్లి ఎస్సై, రజిత, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
