SAKSHITHA NEWS

Director Sunil Kumar Reddy – It would be good to have a creative education system

క్రియేటివ్ ఎడ్యుకేషన్ సిస్టం ఉంటే బాగుంటుంది – దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి

వైవిధ్యభరితమైన చిత్రాలు నిర్మించిన శ్రావ్య ఫిలిమ్స్ పతాకంపై పి సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో డాక్టర్ ఎల్ ఎన్ రావు మరియు యక్కలి రవీంద్ర బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న యూత్ ఫుల్ ఎంటర్టైనర్  “వెల్కమ్ టు తీహార్ కాలేజ్”. ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ లో విద్య పేరుతో జరుగుతున్న భందిఖానాని  అరాచకాన్ని సునిశిత  హాస్యం తో చిత్రీకరించిన క్యాంపస్ చిత్రం ఇది. ర్యాంకుల పోటీలోపడి నలిగిపోతున్న యువత అంతరంగాన్ని వినోదభరితంగా ఆలోచింపజేసే విధంగా నిర్మించబడిన ఈ చిత్రం సెప్టెంబర్ 28న విడుదల అవుతుంది. 

ఈ చిత్ర విశేషాలు తెలియజేస్తూ దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ 

మన ఎడ్యుకేషన్ సిస్టం వల్ల యువత ఈ రోజుల్లో ఆత్మహత్య చేసుకుంటున్నారు. ర్యాంకుల కోసం పిల్లల ప్రాణాలు తోడేస్తున్నాం. చాలా దేశాల్లో ఇలాంటి ఎడ్యుకేషన్ సిస్టం లేదు. కొన్ని దేశాల్లో పిల్లలకు ప్రకృతి తోనే ఎన్నో పాఠాలు నేర్పుతున్నారు. మన ఎడ్యుకేషన్ సిస్టమ్  తల్లిదండ్రులకు పిల్లలకు ధైర్యం ఇవ్వాలి. తన సిస్టం లో ఖచ్చితమైన మార్పు రావాలి లేకపోతే పిల్లలు ఇంకా నలిగిపోతారు. ప్రతి ఒక్కరు ఇది ఆలోచించాలి. 

నా చిత్రం ఒక స్టూడెంట్ కొన్నాం నుంచి ఉంటుంది. స్టూడెంట్స్ పడే బాధలు ఎలా ఉంటాయో చుపించాము. ఈ రోజుల్లో మనకి పలానా దాని గురించి తెలుసుకోవాలి అంటే గూగుల్ ని అడిగితే చెప్పేస్తుంది మరి ఇంకా చదువుని భట్టి పెట్టాల్సిన అవసరం ఏంటి, క్రియేటివ్ ఎడ్యుకేషన్ సిస్టం ఉంటే బాగుంటుంది. ఈ చిత్రాన్ని వినోదాత్మకంగా తెరకేక్కిన్చాము. యూత్ బాగా ఎంజాయ్ చేస్తారు. 

పిల్లలకు చదువుతో పాటు తన మీద తనకు విశ్వాసం కలిగించాలి కానీ ర్యాంకులు కాదు అనే అంశాన్ని ఈ చిత్రంలో చెప్పాము. మనోజ్ నందన్, చక్రవర్తి, మనీషా మరియు సోనీ రెడ్డి ముఖ్య పాత్రలు చేశారు. ఈ నాలుగు పాత్రలో యూత్ ప్రేక్షకులు తమని తాము చూసుకుంటారు. అందరూ చాలా బాగా చేశారు. మేము కొంత మంది టీచర్ కి స్టూడెంట్ కి మా చిత్రాన్ని చుపించాము, అందరూ సినిమా చాలా బాగుంది అని తెలిపారు. చాలా కాలేజెస్ సినిమా టికెట్స్ కూడా బుక్ చేసుకున్నారు. అక్టోబర్ 28న విడుదల అవుతుంది. 

ఈ సినిమాలోని ఏదో ఒక క్యారెక్టర్‌కి ప్రతి స్టూడెంట్‌ కనెక్ట్‌ అవుతాడు. తల్లిదండ్రులు, స్టూడెంట్స్‌ చూడాల్సిన చిత్రం ఇది. ఈ సినిమా కోసం కొందరు స్టూడెంట్స్‌తో మాట్లాడటం జరిగింది. మన విద్యావ్యవస్థలోని అంశాలను సీరియస్‌గా చూపిస్తే అంతగా నచ్చకపోవచ్చు. అందుకే అవే అంశాలను వినోదాత్మకంగా చెప్పే ప్రయత్నం చేశాం.

చదలవాడ శ్రీనివాస రావు గారితో మరో సినిమా ప్లాన్ లో ఉంది. ప్రస్తుతానికి ట్రాన్స్ జెండర్ వాళ్ళ మీద ఒక సినిమా చేస్తున్న. ప్రస్తుతానికి స్క్రిప్ట్ దశలో ఉంది. త్వరలో సెట్స్ మీదకు వెళ్తాము” అని తెలిపారు. 

చిత్రం పేరు : వెల్కమ్ టు తీహార్ కాలేజ్

బ్యానర్ : శ్రావ్య ఫిలిమ్స్

నటి నటులు : మనోజ్ నంధం ఫణి చక్రవర్తి, కృష్ణ తేజ, సోనీ రెడ్డి, మనీషా, మౌనిక, తనీషా,  వినయ్ మహాదేవ్, స్టార్ మేకర్ సత్యానంద్, , బుగత సత్యనారాయణ, సముద్రం వెంకటేష్, నల్ల శ్రీను, మల్లికా తదితరులు

కెమెరా మాన్  & ఎడిటింగ్ : సాబు జేమ్స్

సంగీత దర్శకుడు : ప్రవీణ్ ఇమ్మడి.  

కలరింగ్ అమల్

వి ఎఫ్ ఎస్ : శ్యాం కుమార్ ,పీ

పి ఆర్ ఓ : పాల్ పవన్

సౌండ్ మిక్సింగ్: పద్మారావు

నిర్మాతలు : డాక్టర్ ఎల్ ఎన్ రావు యెక్కలి రవీంద్ర బాబు

దర్శకుడు : పి సునీల్ కుమార్ రెడ్డి


SAKSHITHA NEWS