మంచిర్యాల జిల్లా:-
- సీఐటీయు ఆధ్వర్యంలో పెండింగ్ బిల్లులు చెల్లించాలని జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా
- ఎన్నికల్లో ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి.
మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో మంగళవారం రోజున జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి అనంతరం కలెక్టర్ కార్యాలయం ఏవో మరియు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం సూపర్ డెంట్ అజయ్ కు వినతిపత్రలు ఇవ్వడం జరిగింది.ఈ సందర్బంగా దాసరి రాజేశ్వరి, ఎండి, రఫియా మధ్యాహ్నం భోజనం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ.. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమయిందన్నారు. జిల్లాలో గత 8 నెలల నుండి కోడి గుడ్డు బిల్లులు, 9,10 వ తరగతి బిల్లులు వెంటనే చెల్లించాలి.
మెనూ చార్జీలు పెంచాలి. కార్మికులు అందరికి పీఫ్ ఈ ఎస్.ఐ మరియు పెన్షన్, ఉద్యోగ భద్రత సౌకర్యాలు కల్పించాలన్నారు. దుంపల రంజిత్ కుమార్ సీఐటీయు జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ..ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి.ప్రతి కార్మికురాలికి నెలకు రూ,,10,000/- వేతనం చెల్లించాలి. కోడి గుడ్డును, గ్యాస్ ను ప్రభుత్వమే ఉచితంగా సరఫరా చేయాలి, కార్మికులను పాఠశాలల హెచ్. ఎం.లు ఇబ్బందులకు గురి చేయవద్దని ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించాలి లేకుంటే ఆందోళన పోరాటాలు చేస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.ఈ కార్యక్రమంలో రబియా, లక్ష్మి, సరిత, తదితరులు పాల్గొన్నారు.