SAKSHITHA NEWS

త్రాగునీటి సమస్యలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు…..గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము చేసిన విజ్ఞప్తిపై చర్యలు ప్రారంభం

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో….. స్పందించిన చీఫ్ ఇంజనీర్ & ప్రాజెక్ట్ డైరెక్టర్, APDWSC, RWS&S….హరి రామ్ నాయక్

గుడివాడ నియోజకవర్గంలోని 44 గ్రామాల్లో ఫీల్డ్ విజిట్ చేసి….. రెండు రోజుల్లో నివేదికలు అందించాలంటూ ఆదేశాలు జారీ చేసిన చీఫ్ ఇంజనీర్ హరి రామ్ నాయక్

చీఫ్ ఇంజనీర్ ఆదేశాలతో చర్యలు చేపట్టిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు.

గ్రామాల వారిగా బృందాల ఏర్పాటు.

చీఫ్ ఇంజనీర్ తక్షణ స్పందనపై హర్షం వ్యక్తం చేసిన…. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

త్రాగునీటి సమస్య పరిష్కారానికి ఆదేశాలిచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు……. గుడివాడ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే రాము…..

చీఫ్ ఇంజనీర్ & ప్రాజెక్ట్ డైరెక్టర్, APDWSC, RWS&S హరి రామ్ నాయక్ జారీచేసిన సర్క్యులర్లోని ముఖ్యంశాలు…..

గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము విజ్ఞప్తి మేరకు….

ప్రధమ ప్రాధాన్యతనిస్తూ నీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి.

నందివాడ మండలంలోని 18 గ్రామాలు…. గుడివాడ రూరల్ మండలంలోని 7గ్రామాలు…..

గుడ్లవల్లేరు మండల పరిధిలోని 19 గ్రామాలు…. మొత్తం 44 గ్రామాల్లో గ్రామీణ నీటిపారుదల శాఖ బృందాలు తక్షణ పర్యటన చేపట్టాలి.

పంచాయితీల పరిధిలోని త్రాగునీటి చెరువుల ట్యాంకుల్లో నీటి నాణ్యతను తెలుసుకునేందుకు అధికారుల బృందం స్వయంగా పర్యటించాలి.

ప్రభుత్వ ల్యాబుల్లో పరీక్షించిన నీటి స్వచ్ఛత రిపోర్టులను….. రెండు రోజుల్లో అధికారులకు అందించాలి.

నీటి స్వచ్ఛత రిపోర్టులను బట్టి……. ఫిల్టర్ బెడ్లకు తక్షణ మరమ్మతులు నిర్వహించాలి.

అవసరమైనచోట్ల కొత్త ఫిల్టర్ బెడ్లను వేగవంతంగా ఏర్పాటు చేయాలి.


SAKSHITHA NEWS