SAKSHITHA NEWS

సర్కిల్లో అక్రమంగా నిర్మిస్తున్న నిర్మాణాలను కూల్చేయ్యండి.
సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమామహేష్ డిమాండ్.

 కుత్బుల్లాపూర్ మరియు గాజులరామారం సర్కిల్లో అనుమతులు లేకుండా ప్రభుత్వ మరియు ప్రైవేటు భూములలో అనేక నిర్మాణాలు వెలుస్తున్నాయని, వీటివల్ల ప్రభుత్వం ఆదాయానికి గండిపడటమే కాకుండా రానున్న రానున్న రోజుల్లో అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయని కాబట్టి సర్కిల్లో అక్రమంగా నిర్మాణం అవుతున్నటువంటి ఇండ్లను అదేవిధంగా మున్సిపల్ పర్మిషన్ ప్రకారం రెండంతస్తులు కాకుండా ఒక్కొక్కరు నాలుగు, ఐదు అంతస్తులను నిర్మిస్తున్నారని, అంతేకాకుండా కొంతమంది రోడ్డుపైకి గల్లీల లోపలికి స్లాబులు వేసి అంబులెన్సులు, ఫైర్ కంట్రోల్ వాహనాలు లాంటివి రాలేని పరిస్థితి ఏర్పడ్డాయని, గత ప్రభుత్వ హాయంలో ఇటువంటి నిర్మాణాలు రాజకీయ లేక ప్రజాప్రతినిధుల అండ తో బాగా వెలిశాయని నేడు అదే కొనసాగుతుందని దానిని వెంటనే అరికట్టాలని నేడు సిపిఐ నాయకత్వం గాజులరామారం మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ మల్లారెడ్డి  కి, కుత్బుల్లాపూర్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ నరసింహ  కి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది.

       ప్రతినిత్యం ఏదో ఒక విధంగా మున్సిపల్ సిబ్బంది అన్ని ప్రాంతాలలో పర్యటిస్తూనే ఉంటారని అటువంటి సమయంలో వారి దృష్టికి వచ్చినటువంటి అక్రమ నిర్మాణాలను తెలుసుకొని ఎవరు ఫిర్యాదు చేసినా చేయకపోయినా వెంటనే ఆ నిర్మాణదారునికి నోటీసులు పంపించి తగు చర్యలు తీసుకోవాలని ఒకవేళ అలాంటి చర్యలు తీసుకోకపోతే ఆ నిర్మాణదారులతో మున్సిపల్ అధికారులు అయ్యారని సిపిఐ భావిస్తే మాత్రం దానిపైన మున్సిపల్ సోనల్ కమిషనర్  కి అధికారుల పైనే ఫిర్యాదు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. కొంతమంది కిందిస్థాయి మున్సిపల్ సిబ్బంది నిర్మానుదారులతోటి ఫిర్యాదు చేసిన వారి సమాచారాన్ని ఇచ్చి వారితో మాట్లాడుకుని సమస్యలను పరిష్కరించుకోవాలని చెప్పడం వల్ల కొంతమంది దళారులు అదేపనిగా నిర్మాణాల పైన ఫిర్యాదు చేసి ప్రజల నుంచి డబ్బులు డిమాండ్ చేసి అందులో కొంత మొత్తం ఆ సిబ్బంది కూడా ఇస్తున్నారని ప్రజలు భావిస్తున్నారని అన్నారు.

కావున మున్సిపల్ సిబ్బందికి అందరికీ సరైన ఆదేశాలు జారీ చేసి అటువంటి అక్రమాలకు పాల్పడకుండా భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని అక్రమ నిర్మాణాలను అరికట్టాలని కోరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు హరినాథ్ రావు, కౌన్సిల్ సభ్యులు శ్రీనివాస్, గుట్ట శాఖ కార్యదర్శి సహదేవరెడ్డి, ప్రజానాట్యమండలి అధ్యక్షుడు బాబు, సిపిఐ నాయకులు ఇమామ్, ప్రభాకర్, జంబు పాల్గొన్నారు.