SAKSHITHA NEWS

ప్రకాశం జిల్లా పెద్దారవీడు

జగనన్న గోరుముద్ద ద్వారా రుచికరమైన భోజనం

పెద్దారవీడు:జగనన్న గోరుముద్ద ద్వారా ప్రతిరోజు విద్యార్థులకు రుచికరమైన మోనూతో బలవర్థకమైన పౌష్టికాహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని మండల సర్పంచుల సంఘం ఉపాధ్యక్షుడు, సుంకేసుల సర్పంచి గుడ్డెపోగు రమేష్ అన్నారు. మండలంలోని సుంకేసుల గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక స్పెషల్ మరియు జనరల్ పాఠశాలలో పాటు,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలలో రాగిజావను సర్పంచి రమేష్ చేతుల మీదుగా ఉపాధ్యాయులు,పిఎం సి చైర్మన్ లు పంపిణీ చేశారు. సందర్భంగా సర్పంచి మాట్లాడుతూ విద్యార్థుల్లో పౌష్టికతను పెంచేందుకు రక్తహీనతను తగ్గించేందుకు మధ్యాహ్నం భోజనంలో రాగిజావ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారన్నారు.

గత ప్రభుత్వంలో ఉడికి ఉడకని అన్నం,రుచిపచీ లేని కూరలతో ఒకే రకమైన మధ్యాహ్న భోజనం ప్రతిరోజు సరఫరా చేయడంతో విద్యార్థులు తినలేక అవస్థలు పడ్డారని గుర్తు చేశారు.జగనన్న గోరుముద్దలో భాగంగా ఇప్పటికే వారానికి 15వెరైటీలు,ఐదు రోజులపాటు గుడ్లు, 3రోజులపాటు చిక్కీ,ఈరోజు నుండి 3 మూడు రోజులు రాగిజావ కూడా అందజేయడం జరుగుతుందన్నారు. అనంతరం జావాను తాగి రూచి చుశారు. ఈ కార్యక్రమంలో పిఎంసి చైర్మన్ దర్శనం గురవయ్య,నారారెడ్డి కొల్లెపోలురాజు, ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణరెడ్డి, కళాధర్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS