
స్వర్గీయ నందమూరి తారకరామారావు శత జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు పేద ప్రజల ఆకలి తీర్చాలన్న సంకల్పంతో బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జ్ వేగేశన నరేంద్ర వర్మ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ నందు నేడు 174వ రోజు బాపట్ల కి చెందిన తెలుగుదేశం పార్టీ జిల్లా లీగల్ సెల్ కార్యదర్శి కంచర్ల అవినాష్ సతీమణి కీ.శే.శ్రీమతి కంచర్ల హెబ్సిబా ద్వితీయ వర్థంతి సందర్భంగా వారి జ్ఞాపకార్థం కుటుంబ సభ్యుల సహకారంతో దాదాపు 250 మంది పేదలకు అన్న వితరణ చేయడం జరిగింది. పేదల ఆకలి తీర్చే ఇంత మంచి కార్యక్రమంలో భాగస్వామ్యులు అయ్యి తమ సహకారాన్ని అందించిన దాతలకు నరేంద్ర వర్మ ధన్యవాదాలు తెలియజేశారు.
