SAKSHITHA NEWS

మంత్రి అచ్చెన్నాయుడు ని కలిసిన దాసరి శేషు….

వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కింజరాపు అచ్చెన్నాయుడు ని విజయవాడలో నూతన గృహం ప్రవేశం సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామ్ చంద్ర శేషు మంత్రి స్వగృహంలో కలిశారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెనాయుడుతో శేషు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా మీరు బాధ్యతలు చేపట్టిన తర్వాత వ్యవసాయానికి చక్కని సహాయం అందుతుందని రైతులను అన్ని విధాలా ఆదుకుంటున్నారని వీలైనంత తొందరగా వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ కమిటీలను పూర్తి చేయాలని కోరారు.

అతి త్వరలో కమిటీ వేసేందుకు చర్యలు చేపట్టామని మంత్రి అచ్చెనాయుడు తెలిపారని శేషు అన్నారు. మంత్రిని కలిసిన వారిలో జంగారెడ్డిగూడెం మండల తెలుగు రైతు అధ్యక్షుడు ఎలికే వరప్రసాద్, కోన అప్పారావు, మండల ఎస్సీ సెల్ అధికారి ప్రతినిధి తాళ్లూరి వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు.


SAKSHITHA NEWS