కనిగిరి నియోజకవర్గం రాజకీయాలలో తనకు అత్యంత సన్నిహితుడు, తన శ్రేయోభిలాషి అయినటువంటి వై ఎం ప్రసాద్ రెడ్డి (బన్నీ) ప్రకాశం జిల్లా కో-ఆపరేటివ్ సొసైటీ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ గా ఎన్నిక కావడం చాలా సంతోషకరమని కనిగిరి మాజీ ఏఎంసీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్ పేర్కొన్నారు మాజీ మంత్రి ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసులు రెడ్డి నివాసంలో దుశ్యాలతో సన్మానించి, పుష్పగుచ్చంతో శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా వైకాపా సీనియర్ నాయకులు బాలినేని శ్రీనివాసులు రెడ్డికి దారపనేని హార్దిక కృతజ్ఞతలు తెలిపారు. వై ఎం ప్రసాద్ రెడ్డి కనిగిరి మాజీ జెడ్పిటిసి గా, నియోజకవర్గం లో అందరికీ సుపరిచితుడుగా ఉన్నారని భవిష్యత్తులో నా మిత్రుడైన బన్నీ ఇంకా ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని దారపనేని తెలిపారు. ముప్పవరపు చెన్నకేశవులు, పంగా నాగేంద్రం యాదవ్, ఇర్రి కృష్ణారెడ్డి, బన్నీకి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.
బన్నీకి అభినందనలు తెలిపిన దారపనేని…….
Related Posts
విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ ఒక చరిత్ర: సీఎం చంద్రబాబు
SAKSHITHA NEWS విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ ఒక చరిత్ర: సీఎం చంద్రబాబు విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ ఒక చరిత్ర: సీఎం చంద్రబాబుఆంధ్రప్రదేశ్ : స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ విడుదల ఒక చరిత్ర అని సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ…
చంద్రబాబుకు ప్రాణహాని కామెంట్లు -వి.సా.రెడ్డిపై కేసు
SAKSHITHA NEWS చంద్రబాబుకు ప్రాణహాని కామెంట్లు -వి.సా.రెడ్డిపై కేసు ? చంద్రబాబును ఏదో చేస్తామని బెదిరించిన విజయసాయిరెడ్డికి అత్యంత గడ్డు పరిస్థితులు ఎదురు కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఆయనపై టీడీపీ నేతలు వరుసగా రోజుకొకరు ప్రెస్ మీట్ పెట్టి విమర్శలు గుప్పిస్తున్నారు.…