నకిరేకల్ (సాక్షిత ప్రతినిధి)
స్వాతంత్ర సమరయోధులు, దళిత జన బాంధవుడు , సంఘసంస్కర్త భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 115వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నకిరేకల్ నియోజకవర్గ ఇన్చార్జ్
దైద రవీందర్ కాంగ్రెస్ నాయకులతో కలిసి నకిరేకల్ పట్టణంలోని వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దైధ రవీందర్ మాట్లాడుతూ అంటరానితనాన్ని నిర్మూలించడానికి ఎంతో ప్రయత్నం చేశారని, దేశ స్వాతంత్ర్య పోరాటంలోనూ ముందున్నారు.
సత్యాగ్రహం, శాసనోల్లంఘన ఉద్యమం, క్విట్ ఇండియా వంటి ఉద్యమాల్లో గాంధీజీ వెంట నడిచారన్నారు. ఆయన నడిచిన బాట అనుసరించిన ఆదర్శాలు చూపిన సంస్కరణ మార్గాలనూ గుర్తుచేసుకుంటూ ఆయన జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు గాజుల సుకన్య శ్రీనివాస్, దైవ స్వప్న,
మాజీ సింగిల్ విండో చైర్మన్ గార్లపాటి రవీందర్ రెడ్డి , సీనియర్ కాంగ్రెస్ నాయకులు బొబ్బలి నరసింహారెడ్డి , సామాజిక కార్యకర్త వంటెపాక అంబేద్కర్ , యూత్ కాంగ్రెస్ నకిరేకల్ నియోజకవర్గ అధ్యక్షుడు ముద్దం విజయ్ , ఎం.డి యూసుఫ్, అబ్దుల్ మజీద్, దీకొండ ధనమ్మ, వంటెపాక సతీష్, వంటెపాక నక్షత్, చెరుపల్లి సైదులు, పొట్టబత్తుల నగేష్, పశుపతి, నల్గొండ మహేష్, పందిరి సతీష్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.