SAKSHITHA NEWS

ఆంధ్రప్రదేశ్‌పై తుపాను ప్రభావం- సీమ జిల్లాల్లో జోరు వానలు- తమిళనాడులో కుండపోత

బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ఇవాళ అల్పపీడనంగా మారనుంది. ఇది మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో జోరు వానలు పడొచ్చని చెబుతోంది. తెలంగాణలోని కొన్ని ప్రాంతాలపై కూడా ఎఫెక్ట్ ఉంటుందని అంచానా వేస్తోంది. అందుకే ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు అధికారులు. ఈ వాతావరణం ప్రభావంతో ఇప్పటికే తమిళనాడులో జోరు వానలు దంచి కొడుతున్నాయి.

బంగాళాఖాతం, హిందూ మహా సముద్రం మీదుగా ఏర్పడనున్న అల్పపీడనం వాయుగుండంగా మారబోతోందని కూడా చెబుతున్నారు. ఇది ఒకట్రెండు రోజుల్లో తుపానుగా కూడా మారొచ్చని చెబుతున్నారు. తుపానుగా మారితే మాత్రం ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా తీరాలపై ప్రభావం ఉంటుంది. వాతావరణ అధికారులు చెబుతున్న లెక్కల ప్రకారం ఇవాళ్టి నుంచి 18వ తేదీ వరకు భారీ వర్షాలు ఖాయంగా కనిపిస్తుంది. ఎక్కువ వర్షాలు రాయలసీమలో ఉంటాయి.

ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం
అల్పపీడనం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణశాఖాధికారులు చెబుతున్నారు. ఓవైపు తుపాను పరిస్థితులు, మరోవైపు ఈశాన్య రుతుపవనాల రాకతో వర్షాలు పడతాయి. వీటన్నింటి కారణంగా బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, నెల్లూరు, వైఎస్సార్, అన్నమయ్య, చి­త్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడుతున్నాయి. కాకినాడ, అంబేద్కర్‌ కోనసీమ, విశాఖ, అనకా­పల్లి, పశ్చిమ గోదావరి, కృష్ణా, పల్నాడు జిల్లాల్లో చిరు జల్లులు పడతాయి.


SAKSHITHA NEWS