సాక్షిత : సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో సమ్మర్ క్రైమ్ ప్రివెన్షన్ పై సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ… సమ్మర్ క్రైమ్స్ లో ముఖ్యంగా ఆటోమొబైల్ తెఫ్ట్ , హౌస్ హోల్డ్ తెఫ్ట్, ప్రాపర్టీ తెఫ్ట్ ఎక్కువగా జరుగుతాయని సీపీ తెలిపారు.
సైబరాబాద్ కమీషనరేట్ పరిధిలో గత ఐదు సంవత్సరాలుగా జరుగుతున్న సమ్మర్ క్రైమ్స్ పైన అనాలిసిస్ చేసి సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మేజర్ హాట్ స్పాట్స్ ని గుర్తించడం జరిగిందన్నారు.
10.04.2023 రోజున సమ్మర్ క్రైమ్ ప్రివెన్షన్ స్ట్రాటజీస్ పైన సంబంధించి యాక్షన్ ప్లాన్స్ కోసం సర్కులర్ మెమో కూడా జారీ చేశామన్నారు. ఎక్కువగా దొంగతనాలు అన్ని వేసవి కాలంలోనే జరుగుతాయన్నారు.
సైబరాబాద్ కమిషనరేట్ లోని సిబ్బంది అందరూ క్రైమ్ ప్రివెన్షన్ అండ్ క్రైమ్ డి టెన్షన్ కొరకు కష్టపడి పని చేస్తున్నారన్నారు. బాలానగర్ పోలీసులకు పట్టుబడిన కరుడుకట్టిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాని అరెస్టు చేయడమే ఇందుకు ఉదాహరణ అన్నారు. పోలీసు సిబ్బంది రానున్నరెండు నెలలు ఇంకా ఎక్కువగా వేసవి దొంగతనల పై దృష్టి సారించాలన్నారు.
సమ్మర్ క్రైమ్ ప్రివెన్షన్ స్ట్రాటజీస్ పైన సిబ్బంది యాక్షన్ ప్లాన్ ను ఏంటని సీపీ అడిగి తెలుసుకున్నారు. జోన్ల వారీగా పోలీసుస్టేషన్ పరిధిలోని ముఖ్యమైన హాట్ స్పాట్ లపై రోజువారి సమీక్ష నిర్వహించుకోవాల్లన్నారు. ఉన్నత స్థాయి అధికారి నుండి కానిస్టేబుల్ లెవెల్ వరకు కలిసికట్టుగా క్రైమ్ ప్రివెన్షన్ అండ్ క్రైమ్ డి టెన్షన్ కొరకు పని చేయాలన్నారు. ప్రజలకు పోలీసులపై నమ్మకం పెరిగేలా పని చేయాలని సూచించారు.
సిపి జోన్లవారీగా డే&నైట్ బీట్ల ను స్వయంగా మానిటర్ చేస్తానన్నారు. పూర్తి పోలీసు సిబ్బందిని బీట్లు మరియు పెట్రోలింగ్ ఉపయోగించుకోవాలన్నారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చే అంతరాష్ట్ర ముఠాలపై నిఘా ఉంచాలన్నారు.
గేటెడ్ కమ్యూనిటీస్, అపార్ట్ మెంట్లలో అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. గేటెడ్ కమ్యూనిటీస్ అపార్ట్మెంట్స్ విల్లాలలో సీసీటీవీ కెమెరాలను అమర్చుకోవాలన్నారు. గేటెడ్ కమ్యూనిటీ, అపార్ట్మెంట్స్ లో పనిచేసే సెక్యూరిటీ సిబ్బందితో పోలీస్ వారు అవగాహన సదస్సులు నిర్వహించుకోవాలన్నారు.
జైలు నుండి విడుదలైన పాత నేరస్తులపై నిఘా ఉంచాలన్నారు. అలాగే క్షేత్రస్థాయి పోలీస్ సిబ్బంది హోటల్స్ లాడ్జిలపై నిఘా ఉంచాలన్నారు. తరచుగా వాహనాల తనిఖీలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుండి వచ్చే వాహనాలను తనిఖీ చేయాలన్నారు.
ఈ సమావేశంలో సైబరాబాద్ సిపి తో సైబరాబాద్ డిసిపి క్రైమ్స్ సింగెన్వర్ కల్మేశ్వర్, ఐపిఎస్., లా అండ్ ఆర్డర్ డిసిపిలు మాదాపూర్ డిసిపి శ్రీమతి శిల్పవల్లి, శంషాబాద్ డిసిపి నారాయణరెడ్డి, ఐపీఎస్., రాజేంద్రనగర్ డిసిపి జగదీశ్వర్ రెడ్డి, బాలనగర్ డిసిపి శ్రీనివాసరావు, ఐపిఎస్., మేడ్చల్ డిసిపి సందీప్, ఏడిసిపి రాజేంద్రనగర్ శ్రీమతి రేష్మి పెరుమాళ్, ఐపిఎస్., ఏడీసీపీ క్రైమ్స్ నర్సింహా రెడ్డి, ఇతర ఏడీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఇతర సిబ్బంది ఆన్లైన్ ద్వారా పాల్గొన్నారు.