SAKSHITHA NEWS

పంటల బీమా పథకాలు రైతులకు కీలకమైనవవి
-పంట కోత ప్రయోగాలు నిర్వహించాల్సిన పద్ధతిపై అవగాహన
-ప్రతీ ఒక్క సాగు విస్తీర్ణం ఇ – పంటగా నమోదు

జెసి చిన్న రాముడు
సాక్షిత రాజమహేంద్రవరం :
ప్రతి రైతు కష్టపడి పండిస్తున్న పంటలకు భీమ పథకాలు అత్యంత కీలకమైనమని, పంటలకు
వాతావరణంలో మార్పు, ప్రకృతి వైపరీత్యాలు, వ్యవసాయ మార్కెట్‌లో ధరల హెచ్చుతగ్గుల కారణంగా రాబడి నష్టం వంటివి కారణంగా రైతు నష్టపోకుండా  ప్రభుత్వం పంటల బీమా విధానాన్ని ప్రవేశపెట్టిందని జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు అన్నారు. బుధవారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పంటల  బీమా పథకం / పంట కోత ప్రయోగాలు  ఇ – పంట పై జిల్లాస్థాయి శిక్షణా కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ ఎస్. చిన రాముడు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి జిల్లా హార్టికల్చర్ అధికారి పాల్గొన్నారు.


ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు మాట్లాడుతూ రైతు పండించిన పంటకు ప్రకృతి విపత్తుల వలన  ఏర్పడిన నష్టానికి పరిహారం చెల్లించేందుకు ప్రతి రైతు తాను పండించే పంట ఇ – పంట నమోదు తప్పనిసరిగా చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పంట కోత ప్రయోగాలను  పక్కా గా నిర్వహించి ఖచ్చితమైన దిగుబడులను నమోదు చేయాలని సూచించారు. జిల్లాలో ఇప్పటివరకు  96 శాతం సీసీ ఆర్సి కార్డులు నమోదు 48 వేల ఎకరాల లో ఈ పంట (ఈ క్రాప్ బుకింగ్) నమోదు  జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు పేర్కొన్నారు. జిల్లాలో ఇ –  పంటలో భాగంగా  వ్యవసాయ రంగంలో 85,684 ఎకరాలు, హార్టికల్చర్ రంగంలో 50,372 ఎకరాలు సాగు విస్తీర్ణంలో ఉందన్నారు. సదరు సాగు భూములను ఈ క్రాప్ లో ప్రభుత్వం అమలు చేసే రాయితీ లు సబ్సిడీ నమోదు  ద్వారా  వ్యవసాయ , అనుబంధ శాఖలోని అన్ని పథకాలకు ప్రామాణికంగా తీసుకోవడం జరుగు తుందన్నారు.  జిల్లాలో నూరుశాతం సీసీ ఆర్సీ కార్డులు లక్ష్యంలో 53,060 కి గాను 50,907 మందికి జారీ చేసినట్లు తెలిపారు.  ఈ క్రాప్ బుకింగ్ లో 136056 ఎకరాలకు గాను 48 వేల ఎకరాలలో నమోదు చేయగా బిక్కవోలు 59 శాతం, గోకవరం 54 శాతం సాధించగా, సీతా నగరం 15 శాతం, రాజమండ్రి రూరల్ 16 శాతం సాధించి దిగువ స్థానంలో ఉన్నాయన్నారు. ప్రధామ స్థానంలో ఉన్న వారీ నుంచి స్ఫూర్తి పొందాలని జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు పేర్కొన్నారు.

జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. మాధవరావు మాట్లాడుతూ జిల్లాలో ఖరీఫ్ 2024 సంవత్సరానికి సంబంధించి రైతులందరూ తప్పనిసరిగా ఇ – పంట నమోదు చేయించుకునే విధముగా తగు చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు.  జిల్లా వ్యాప్తంగా  జరిగే సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమంలో రైతులందరూ పాల్గొనే విధంగా చైతన్యం కల్పించామని, ఇందుకు సంబంధించిన ఎలుకల మందు ఇప్పటికే అందుబాటులో ఉంచడం జరిగినదని తెలియ జేసారు. ఆహార ధాన్యాల ఉత్పత్తి, నిల్వలలో రైతుకు ప్రథమ శత్రువులు ఎలుకలు. విత్తనం వేసినది మొదలు ధాన్యం అమ్మేవరకు లేదా తినేవరకు ఎలుకలు వరిపైరుకు, ధాన్యానికి నష్టం కల్గిస్తాయి. ఇవి తినేదానికన్నా 7-8 రెట్ల ధాన్యాన్ని అధికంగా పాడుచేస్తాయని,  అందుచేతనే, రైతులు ఎలుకలను తూర్పు స్థాయిలో నివసించే విధంగా అవగాహన కల్పిస్తున్న మన్నారు. సామూహికంగా ఎలుకల నివారణ చేపట్టడం ద్వారా  పంట నష్టాన్ని నివారణతో అధిక దిగుబడులు సాధించండం సాధ్యం అవుతుందని పేర్కొన్నారు. పంటల భీమా,  ధాన్యం కొనుగోలు తదితర వివరాల్ని వెబ్ ల్యాండ్  తో కూడి పంట సాగు ధ్రువీకరణ పత్రాలు మరియు ఇ – ఫిష్  డేటా లతో అనుసంధానించడం జరుగుతుందన్నారు.  ప్రస్తుత ఖరీఫ్ ఇ – పంట ను  ఆగస్టు 1 వ తేదీ నుండి ప్రారంభించడం జరిగిందన్నారు.   
జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి ఎల్. అప్పలకొండ మాట్లాడుతూ సీసీఈ యాప్ ద్వారా పంట కోత ప్రయోగాలు జరపాలని  మండల గణాంకాధికారులను  ఆదేశించారు. ఈ సందర్భంగా కోరుకొండ మండల గణాంకాధికారి పవర్  పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పంట కోత ప్రయోగాలు నిర్వహించాల్సిన పద్ధతిపై అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో   జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు,  జిల్లా ఉద్యాన శాఖ అధి కారి బి. సుజాత కుమారి, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి ఎల్.అప్పలకొండ, ఏడీఏలు,  వివిధ మండలాల తహసిల్దారులు, వ్యవసాయ అధికారులు, ఉద్యానవన అధికారులు మరియు గణాంకాధికారులు  తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2024 08 21 at 17.45.41

SAKSHITHA NEWS