
డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌పై సీపీఐ రామకృష్ణ విమర్శలు అనుచితం
సాక్షిత : జీవితాన్ని ప్రజలకు అంకితం చేసిన ప్రజా నాయకుడు పవన్ కళ్యాణ్
జనసేన పార్టీ సెంట్రెల్ ఆంధ్ర కో- కన్వీనర్ పెంటేల బాలాజి
చిలకలూరిపేట:
అనుక్షణం ప్రజలతో మమేకమౌతూ, ప్రజా సమస్యల పరిష్కరానికి కృషి చేస్తూ, తన పాలనలో ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శలు అర్ధరహితమని జనసేన పార్టీ సెంట్రెల్ ఆంధ్ర కో-కన్వీనర్ పెంటేల బాలాజి తీవ్రంగా ఖండించారు. ఆయన కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో బాలాజి మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పరిపాలన వదిలేసి గుళ్లు, గోపురాలు అంటూ తిరుగుతున్నారంటూ చేసిన వ్యాఖ్యలు అనుచితమని, గత పాలనకు ప్రస్తుత పాలనను బేరిజువేసుకోవాలని సూచించారు. ప్రజల కోసం నిలబడటం, అన్యాయంపై గొంతెత్తడం, అరాచకాన్ని నిలదీయటం, దౌర్జన్యాల్ని ఎదిరించటం లో తమ నేత పవన్ కళ్యాణ్ ఎక్కడా రాజీపడలేదని, ఎక్కడా రాజీపడపోరని తెలిపారు.
జీవితాన్ని ప్రజలకు అంకితం చేసిన ప్రజా నాయకుడు
రాజకీయాలలో పవన్ కళ్యాణ్ విలువలు, విశ్వాసాలు నింపేందుకు కష్టపడుతున్నాడని బాలాజి చెప్పారు. తన ఆధ్వర్యంలోని ఏపీ పంచాయతీ రాజ్ శాఖ ద్వారా జరిగిన అభివృద్ది చూస్తే పవన్ కళ్యాణ్ పనితీరు అర్ధం అవుతుందని పేర్కొన్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో 1800 కి.మీ. మేర సీసీ రోడ్లు నిర్మిస్తే ఎన్డీయే అధికారం చేపట్టిన ఆరు నెలల్లోనే 3,750 కి.మీ. సీసీ రోడ్లు వేసినట్లు వెల్లడించారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో మినీ గోకులాలు కేవలం 268 ఏర్పాటు చేస్తే, తాజాగా ఆరు నెలల్లోనే 22,500 నిర్మించినట్లు వెల్లడించారు. పీవీటీజీ ఆవాసాల కోసం వైసీపీ రూ.91 కోట్లు ఖర్చు చేస్తే, కేవలం ఆరు నెలల్లోనే రూ.750 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేసిన నాయకుడు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత పర్యటనపై రాజకీయ చేయడం సీపీఐ రామకృష్ణకు తగదన్నారు. డిప్యూటీ సీఎంగా కళ్యాణ్ పనితీరు, ఆలోచన విధానం చూసిన తర్వాత గతంలో విమర్శలు చేసిన నోళ్లు మూతపడ్డాయని గుర్తు చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app