Corporator Venkatesh Goud who made a padayatra in PJR
పీజేఆర్ లో పాదయాత్ర చేసిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్
124 డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని పీజేఆర్ కాలనీలో డ్రైనేజీ లైన్లు మరియు త్రాగు నీటికి సంబంధించి సమస్యలు ఉన్నాయని కాలనీ వాసులు డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దృష్టికి తీసుకురాగా కార్పొరేటర్ జి.ఎచ్.ఎం.సి అధికారులు మరియు కాలనీ వాసులతో కలిసి పీజేఆర్ నగర్లో పర్యటించి పాదయాత్ర చేస్తూ సమస్యలను స్వయంగా పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ కాలనీలో ప్రధానంగా ఉన్న డ్రైనేజ్ సమస్యను అతిత్వరలో పూర్తి చేస్తామని కాలనీ వాసులకు హామీ ఇచ్చారు. కాలనీ లోని డ్రైనేజ్ లైన్స్ కు సంబంధించి అవసమైన బడ్జెట్ ను ఎస్టీమషన్ వేసి ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే కొంతమంది త్రాగు నీరు ప్రజర్ రావడం లేదని విన్నవించగా, సమస్య ఎక్కడ ఉందో తెలుసుకుని పరిష్కరించాలని వాటర్ వర్క్స్ అధికారులకు తెలిపారు. కాలనీలో పారిశుధ్య సమస్య ఎక్కువగా ఉందని, చెత్తను రోడ్ల మీద లేదా బిల్డింగ్ ల మధ్యలో వేయడం వల్ల మీరు మీ పిల్లలు రోగాల బారిన పడే అవకాశం ఉంది కాబట్టి..మీరందరు మీ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుని, తడిచెత్తా మరియు పొడిచెత్తను వేరువేరుగా బస్తీకి వచ్చి చెత్త సేకరించే ఆటోలలో మాత్రమే వేయాలని, చెత్తను నాలాలలో గాని, రోడ్లమీద గాని, చెరువులలో గాని వేయవొద్దని ప్రజలను కోరారు.
కార్యక్రమంలో జిఎచ్ఎంసి అధికారులు వాటర్ వర్క్స్ మేనేజర్ ఝాన్సీ, వర్క్ ఇస్పెక్టర్స్ రవి కుమార్ మరియు రవీందర్ రెడ్డి, UBD సూపర్వైజర్ నాగ రాణి, ఎంటమాలజీ సూపర్వైజర్ డి.నరసింహులు, సూపర్వైజర్ శివ, ఎస్.ఎఫ్.ఎ మల్లేష్.
కాంగ్రెస్ పార్టీ నాయకులు మరేళ్ల శ్రీనివాస్, సమ్మారెడ్డి, శివరాజ్ గౌడ్, CH. భాస్కర్, బాలస్వామి, యాదగిరి, సంగమేష్, అగ్రవాసు, వాలి నాగేశ్వరరావు, మధులత, భిక్షపతి, మహేష్, సంతోష్ బిరాదర్, సన్యాసిరావు, రాజుగౌడ్, బాలస్వామి సాగర్, ప్రవీణ్, సంతోష్, మధు, అనిల్, యాదగిరి, మోయిన్, రాజు, రెహనా, స్వప్న తదితరులు పాల్గొన్నారు.