SAKSHITHA NEWS

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరియు మంత్రి భారాస పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావు ఆదేశాల మేరకు..శేరిలింగంపల్లి శాసన సభ్యులు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పిలుపుమేరకు 124 డివిజన్ కార్పొరేటర్ శ్ర దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆల్విన్ కాలనీ డివిజన్ సమస్యలపై చేస్తున్న పాదయాత్రలో భాగంగా డివిజన్ పరిధిలోని అంబెడ్కర్ నగర్, సుభాష్ చంద్రబోస్ కాలనీ, మహాత్మాగాంధీ నగర్, గణేష్ నగర్, తారకరామ్ నగర్ కాలనీలలో జిఎచ్ఎంసి అధికారులు మరియు స్థానిక ప్రజలతో కలిసి పాదయాత్ర చేస్తూ ఇంటింటికి వెళ్లి స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది.

ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ డివిజన్ లో అభివృద్ధి పనులన్నీ దాదాపు తొంభై శాతం పూర్తైయ్యాయని అన్నారు. కాలనీలలో కొంతమేర పెండింగులో ఉన్న డ్రైనేజీ మరియు సీసీ రోడ్ల పనులను తొందరలో పూర్తిచేస్తామని అన్నారు. మ్యాన్ హొల్స్ మూతలు, విద్యుత్ దీపాలు, విద్యుత్ వైర్లు వంటి చిన్న చిన్న సమస్యలను స్థానికులు మా దృష్టికి తీసుకువచ్చారని వాటిని సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరిస్తామని అన్నారు.

పాదయాత్ర చేస్తూ ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఆప్యాయంగా స్వాగతం పలుకుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీరు వంటి ఎటువంటి సమస్యలు ఉన్నా పాదయాత్రలో భాగంగా నోట్ చేసుకుని త్వరలో పూర్తిచేస్తామని కాలనీ వాసులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో భాగంగా ఎల్లమ్మబండలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని మరియు అంగణవాడి కేంద్రాన్ని సందర్శించి పేసేంట్లు మరియు పిల్లలతో మాట్లాడి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

అలాగే బిఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులు మరియు అందించిన సంక్షేమ పథకాలను ముద్రించిన కరపత్రాలను ఇంటింటికి అందించడం జరిగింది. కార్యక్రమంలో జిఎచ్ఎంసి అధికారులు వాటర్ వక్స్ రవీందర్ రెడ్డి, వర్క్ ఇన్స్పెక్టర్ రవికుమార్, ఎంటమాలజీ సూపర్వైజర్ డి.నరసింహులు, లైన్ మ్యాన్ నరసింగరావు, ఎస్.ఎఫ్.ఎ మల్లేష్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, సమ్మారెడ్డి, కాశినాధ్ యాదవ్, చిన్నోళ్ల శ్రీనివాస్, గుడ్ల శ్రీనివాస్, శివరాజ్ గౌడ్, దుర్గేష్, బోయ సురేందర్, రాములుగౌడ్, బాలరాజు, సంతోష్ ముదిరాజ్, కాంతన్న, నరసింగ్, మోహన్, మహీందర్ గౌడ్, యాదగిరి గౌడ్, లక్ష్మారెడ్డి, పెయింటర్ జగదీష్, సమ్మద్, బాలస్వామి, CH భాస్కర్, వెంకటేష్, షౌకత్ అలీ మున్నా, ముజీబ్, సాయిగౌడ్, సంతోష్ బిరాదర్, రవీందర్, సలీమ్, కూర్మయ్య, మల్లేష్ గౌడ్, యాదగిరి, ప్రకాష్, జనయ్య, అజ్జస్, రాజ్యలక్ష్మి, మధులత, షేక్ బీబీ, సురేఖ, రేణుక, నస్రీన్, నిర్మల, ప్రీతి, వరలక్ష్మి, లావణ్య, వనజ, వల్లి రమణ, బి.లక్ష్మీ, దేవి, చంద్రకళ, యస్మిన్, మహముదా, జిఎచ్ఎంసి అధికారులు, ఆర్.పిలు, సమాఖ్య లీడర్లు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS