వినేశ్ ఫోగట్‌ను గోల్డ్ మెడల్ తో సత్కరించిన కాప్ పంచాయతీ
న్యూఢిల్లీ:
రెజ్లర్ వినేశ్ ఫోగట్‌ను హర్యానా కాప్ పంచాయతీ స్వర్ణ పతకంతో సత్కరిం చింది. సాయం త్రం ఆమె బర్త్‌డే సందర్భం గా ఈ వేడుకను నిర్వహిం చారు.
ఇటీవల జరిగిన పారిస్ ఒలింపిక్స్‌లో.. 50 కేజీల ఫ్రీ స్టయిల్ రెజ్లింగ్‌లో.. వినేశ్ ఫోగట్ ఫైనల్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే.
అయితే గోల్డ్ మెడల్ మ్యాచ్ జరగాల్సిన రోజు.. అధిక బరువు కారణంగా ఆమెపై అనర్హత వేటు పడింది. దీంతో చరిత్ర సృష్టించే అవకాశాన్ని ఆమె కోల్పోయింది.
ఒలింపిక్స్ ఫైనల్లో అర్హత కోల్పోయినా.. స్వదేశంలో మాత్రం వినేశ్‌కు ఘన స్వాగతం లభించింది. ఆదివారం ఆమె పుట్టిన రోజు నేపత్యంలో సర్వకాప్ పంచాయతీ ఆమెను స్వర్ణ పతకంతో సత్కరించింది.
అనర్హత వేటు వల్ల నిరాశకు గురైనా.. తనకు దక్కిన వెల్కమ్ వల్ల సంతోషంగా ఉన్నట్లు ఆమె చెప్పారు. తన పోరాటం ఆగలేదని, అది ఇప్పుడే మొదలైందని వినేశ్ పేర్కొన్నది..