నాగాలమ్మ ఆలయానికి సిమెంట్ రోడ్డు ఏర్పాటు
సాక్షిత ప్రతినిధి – పుత్తూరు: పుత్తూరు పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే నివాస సముదాయాల వద్ద వెలసిన శ్రీ నాగాలమ్మ దేవాలయానికి కొత్తగా సిమెంట్ రోడ్డు ఏర్పాటు చేశారు. ఇందుకు పుత్తూరు పట్టణానికి చెందిన ఈలెంద్రం పద్మావతి శ్రీనివాసులు శెట్టి కుమారుడు శ్రీకాంత్, జయశ్రీ, ఈఎస్.హర్షిత, ఈఎస్.లోకిత్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో సుమారు 30వేల రూపాయలు వ్యయంతో అమ్మవారి ఆలయానికి సిమెంటు రోడ్డు ఏర్పాటు చేశారు. అలాగే ఆలయంలో జరిగే పూజా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ సిమెంట్ రోడ్డును ఏర్పాటు చేసినట్లు వారు వివరించారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
