రూ.5 కోట్ల 42 లక్షల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణం

Sakshitha news

రూ.5 కోట్ల 42 లక్షల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణం పనులకు, వరద నీటి కాల్వ నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గుల్ మోహర్ కాలనీ, లక్ష్మీ విహార్ ఫేస్ 1, నల్లగండ్ల హుడా కాలనీ, డైమండ్ హైట్స్, TNGO’S కాలనీ, నానక్ రామ్ గూడ , రాయదుర్గంలో అర్బన్ స్కై Panache అపార్ట్మెంట్ నుండి నాల వరకు ,కాజాగుడా కాలనీలలో రూ. 5 కోట్ల 42 లక్షల రూపాయలతో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం పనులకు మరియు వరద నీటి కాల్వ నిర్మాణం పనులకు కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేసిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం మరియు శేరిలింగంపల్లి నియోజకవర్గం మరియు కాలనీ ల అభివృద్దే ధ్యేయంగా ప్రజల సౌకర్యార్థం గుల్ మోహర్ కాలనీ, లక్ష్మీ విహార్ ఫేస్ 1, నల్లగండ్ల హుడా కాలనీ, డైమండ్ హైట్స్, TNGO’S కాలనీ, నానక్ రామ్ గూడ , రాయదుర్గంలో అర్బన్ స్కై Panache అపార్ట్మెంట్ నుండి నాల వరకు ,కాజాగుడా కాలనీలలో రూ. 5 కోట్ల 42 లక్షల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణం పనులకు మరియు వరద నీటి కాల్వ నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసుకోవడం జరిగినది అని, సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని, కాలనీ వాసులకు ఉపశమనం లభించింది అని, మౌళిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తానని PAC చైర్మన్ గాంధీ అన్నారు.

శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధి కై గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ. 1650 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగినది అని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకంలో మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో శేరిలింగంపల్లి నియోజకవర్గం ను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామని , శేరిలింగంపల్లి నియోజకవర్గం ను అగ్రభాగాన నిలబెడుతామని PAC చైర్మన్ గాంధీ తెలిపారు.

సంక్షేమం మరియు అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకం లో శేరిలింగంపల్లి నియోకజకర్గంను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన ,అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదితానని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు. అదేవిధంగా మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని, సీసీ రోడ్లు వంటి అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని ,నాణ్యత విషయంలో ఎక్కడ రాజి పడకూడదని , ప్రజలకు ట్రాఫిక్ రహిత ,సుఖవంతమైన ,మెరుగైన రవాణా సౌకర్యం కొరకు శాయ శక్తుల కృషి చేస్తానని,అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని PAC చైర్మన్ గాంధీ చెప్పడం జరిగినది. పనుల్లో జాప్యం లేకుండా త్వరిత గతిన

పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని PAC చైర్మన్ గాంధీ అధికారులను ఆదేశించడం జరిగినది , ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కలిపిస్తామని ,ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సుఖవంతమైన ప్రయాణానికి బాటలు వేస్తామని PAC చైర్మన్ గాంధీ చెప్పడం జరిగినది.

శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని ,అన్నివేళలో ప్రజలకు అందుబాటులోకి ఉంటానని ,మెరుగైన ప్రజా జీవనానికి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని, గచ్చిబౌలి డివిజన్ మరియు శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని PAC చైర్మన్ గాంధీ పునరుద్ఘాటించారు.

శంకుస్థాపన చేసిన కార్యక్రమాల వివరాలు :

మంజూరైన అభివృధి పనుల వివరాలు

1.గుల్ మోహర్ కాలనీ లో రూ.123 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం పనులకు*

  1. లక్ష్మీ విహార్ ఫేస్ 1 కాలనీ లో రూ.85 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్డు నిర్మాణం పనులకు* *3.నల్లగండ్ల హుడా కాలనీ లో రూ.58.00 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టబోయే సీ సీ రోడ్ల నిర్మాణం పనులకు *4.డైమండ్ హైట్స్ కాలనీ లో రూ.75.00 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం పనులకు

*5. TNGO కాలనీ ఫేస్ 2 లో రూ.40.00 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టబోయే సీ సీ రోడ్ల నిర్మాణం పనులకు

6.నానక్ రాంగుడా మరియు కాజాగుడాలో రూ.47.00 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టబోయే సీ సీ రోడ్ల నిర్మాణం పనులకు మరియు వరద నీటి కాల్వ నిర్మాణం పనులకు

7.రాయదుర్గం లో Urban Sky Panache అపార్ట్మెంట్ నుండి నాల వరకు రూ.114.00 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టబోయే వరద నీటి కాల్వ నిర్మాణం పనులకు

పైన పేర్కొన్న సీసీరోడ్ల నిర్మాణం పనులకు, వరద నీటి కాల్వ నిర్మాణం పనులకు శంకుస్థాపన చేయడం జరిగినది అని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.

ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు, కాలనీల అసోసియేషన్ సభ్యులు,మహిళలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు