ప్రగతి నగర్ 276వ డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీ SIR అవగాహన సదస్సు విజయవంతం||
ప్రగతి నగర్ 276వ డివిజన్‌లో కాలనీవాసుల ఆధ్వర్యంలో నిర్వహించిన SIR అవగాహన సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి
ఈ సందర్భంగా హన్మంతన్న మాట్లాడుతూ, పార్టీ సంస్థాగతంగా మరింత బలోపేతం కావాలంటే BLAలు కీలక పాత్ర పోషించాలని, ప్రతి బూత్ స్థాయిలో సమర్థవంతంగా పనిచేస్తూ పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. అలాగే పార్టీలో నిబద్ధతతో, కష్టపడి పనిచేసే కార్యకర్తలకే తగిన గుర్తింపు లభిస్తుందని, ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ప్రగతి నగర్ 276వ డివిజన్ అధ్యక్షులు శ్రీ బొమ్ము వెంకటేశ్వర్ రెడ్డి (తాతిరెడ్డి) , బాచుపల్లి డివిజన్ అధ్యక్షులు కొలన్ జీవన్ రెడ్డి , మేడ్చల్–మల్కాజిగిరి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మౌళేశ్వర్ రావు , స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, BLAలు, కార్యకర్తలు, BLAలు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
