స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమాన్ని పరిశీలించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ||
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని వెంకటేష్ నగర్, రోడ్ నెం. 6లో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం (Special Intensive Revision – SIR) ను కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి గారు బూత్ లెవెల్ అధికారులతో (BLOలు) కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా హన్మంత్ రెడ్డి మాట్లాడుతూ, ఓటరు నమోదు ప్రక్రియను బీఎల్ఓలు ఇంటింటికీ వెళ్లి పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవడంతో పాటు, ఓటరు జాబితాలో ఖచ్చితత్వం ఉండేలా అవసరమైన వివరాలను సేకరించాలని అధికారులకు సూచించారు.
అదేవిధంగా, ప్రజలు బీఎల్ఓలు అందించే ఎన్యుమరేషన్ ఫారమ్‌లను సక్రమంగా నింపి సమర్పించాలని కోరారు. ముఖ్యంగా 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న యువత ఈ అవకాశాన్ని వినియోగించుకుని కొత్త ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత విలువైనదని పేర్కొన్న ఆయన, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములై విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కె.ఎం. గౌరీష్, యువ నాయకులు కె.ఎం. గిరి, శ్రీధర్ రెడ్డి, భగవాన్ రెడ్డి, మనోహర్, గణేశ్వర్, రమేష్, శ్రీనివాస్, రాజు, జ్యోతి, సీతారామయ్య, పాండురికం, జగదీశ్వర్ రావు, మహేష్ కుమార్, గిరి, సుబ్రహ్మణ్యం, సుబ్బయ్య, కుమార్, బూత్ లెవెల్ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
