SAKSHITHA NEWS

Congress party is taking a step towards victory...Ranjith Reddy's victory is certain

జన్వాడ, సంకెపల్లి, మహారాజ్ పెట్, దొంతాన్ పల్లి గ్రామాలలో ఇంటింట ప్రచారం: రాష్ట్ర పిసిసి సెక్రెటరీ ఉదయ మోహన్ రెడ్డి

శంకర్‌పల్లి: చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి రంజిత్ రెడ్డి గెలుపు కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని రాష్ట్ర పిసిసి సెక్రటరీ ఉదయ్ మోహన్ రెడ్డి, మండల, మున్సిపల్ అధ్యక్షులు జనార్దన్ రెడ్డి, వై ప్రకాష్ అన్నారు.

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శంకర్‌పల్లి మండల పరిధిలోని జన్వాడ, సంకెపల్లి, మహారాజ్ పెట్, దొంతాన్ పల్లి గ్రామాలలో మైసయ్య, చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు.

జన్వాడ గ్రామంలోని వివేకానందుని విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందించిన పేదల పార్టీ అని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న అనేక సంక్షేమ పథకాలను ప్రతి కుటుంబానికి చేరుస్తున్నామన్నారు.

కార్యక్రమంలో ఐఎన్ టి యుసి జనరల్ సెక్రటరీ శేరి అనంతరెడ్డి, జడ్పిటిసి గోవిందమ్మ గోపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ నసిరుద్దీన్,

రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ కన్వీనర్, మాజీ ఏఎంసీ డైరెక్టర్ పెంటయ్య, చేవెళ్ల నియోజకవర్గం అసెంబ్లీ మైనార్టీ అధ్యక్షుడు మహమ్మద్ సమీ ఖురేషి, రాజు గౌడ్, నాయకులు తౌఫిక్, బొల్లారం వెంకట్ రెడ్డి, సట్టగల్ల శ్రీధర్ గౌడ్, ప్రశాంత్ కుమార్, ప్రవీణ్ కుమార్, యాదయ్య గౌడ్, మైమూద్, బల్వంత్ రెడ్డి, కృష్ణారెడ్డి, మోహన్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి, కాశెట్టి మోహన్, మాదిరెడ్డి సమ్మిరెడ్డి, ముప్పిడి వెంకట్ రెడ్డి, నారాల విజయపాల్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, మధు, రఘునందన్ రెడ్డి, శ్రీకాంత్ ముదిరాజ్, అస్లాం, మాజీ ఎంపీటీసీలు ఎజాస్, అశోక్ కుమార్, కౌన్సిలర్లు శ్రీనాథ్ గౌడ్, చంద్రమౌళి, మాజీ ఎంపీపీలు నర్సింలు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు శ్రీధర్, రవీందర్ గౌడ్, చేవెళ్ల బి బ్లాక్ మహిళా అధ్యక్షురాలు రమ్య రెడ్డి, నాగమణి, ప్రత్యూష, పుష్పమ్మ, సుశీల, మహమ్మద్ ఆలియా ఆఫీస్, అమృత పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

Sakshitha News
Download app

https://play.google.com/store/apps/details?id=com.sakshithaepaper.app

Sakshitha Epaper
Download app

WhatsApp Image 2024 05 04 at 7.04.06 PM

SAKSHITHA NEWS