కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజలకు అండగా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ||
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 1288 డివిజన్ చింతల్ వాసులు కె .నర్సమ్మ గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతు నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుటకు ఆర్ధిక స్థోమత లేదు అని తెలుసుకున్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి వెంటనే స్పందించి రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ద్వారా బాధితుడికి శస్త్ర చికిత్స నిమిత్తం రూ. 2,00,000/- ల సీఎం సహాయనిధి – ఎల్వోసీ ని మంజూరి చేయించారు. రూ 2,00,000/- ( రెండు లక్షల రూపాయలు ) CMRF – LOC మంజూరి పత్రాలను శ్రీనివాస్ మామిడి కు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు గడ్డం రాజేందర్ రెడ్డి, కోమటిరెడ్డి లక్ష్మి రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు.