అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌ను అమలు చేయాలి. బీసీలకు 42ు రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిచాలి. లేనిపక్షంలో తెలంగాణ జాగృతి, బీసీ కులాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం’’ అని తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు.సావిత్రిబాయి ఫూలే జయంతిని పురస్కరించుకొని బీసీల డిమాండ్ల సాధన కోసం తెలంగాణ జాగృతి, వివిధ బీసీ సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద బీసీ మహాసభ నిర్వహించారు. ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీలు అడుగడుగునా బీసీలను మోసం చేశాయని ఆరోపించారు. ప్రాంతీయ పార్టీలతోనే బీసీలకు న్యాయం జరిగిందని పేర్కొన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో బీసీల సంక్షేమం, అభివృద్ధిపై ఎక్కడైనా చర్చకు సిద్దమని ఆమె చెప్పారు.
అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ
Related Posts
సీఎం క్యాంపు ఆఫీసులో నిర్వహిస్తున్న ప్రజావాణి
SAKSHITHA NEWS సీఎం క్యాంపు ఆఫీసులో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం ఉత్త ప్రహసనంగా మారిందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. కాంగ్రెస్ సర్కారు చెబుతున్న ప్రజాపాలన ప్రజాపీడనగా మారిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆర్టీఐ కింద అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం..…
మంద కృష్ణ మాదిగ – RS ప్రవీణ్ కుమార్ కలయిక
SAKSHITHA NEWS మంద కృష్ణ మాదిగ – RS ప్రవీణ్ కుమార్ కలయిక. హైదరాబాద్ లో MRPS అధినేత మంద కృష్ణ మాదిగ మరియు BSP మాజీ అధ్యక్షులు, ప్రసుత BRS నేత,IPS అధికారి డా.R S ప్రవీణ్ కుమార్ సమావేశమయ్యారు.…