SAKSHITHA NEWS


Congress leaders who stepped on the encroachment of Tumu canals.

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం,కొంపల్లి మున్సిపాలిటీలోని దూలపల్లి గ్రామంలో తుమార్ చెరువు ఆక్రమణ మరియు తూము కాలువల ఆక్రమణల పై కదం తొక్కిన కాంగ్రెస్ నాయకులు.

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం,కొంపల్లి మున్సిపాలిటీలోని దూలపల్లి గ్రామంలో తుమార్ చెరువు ఆక్రమణ మరియు తూము కాలువల ఆక్రమణ గురించి దూలపల్లి గ్రామస్తులు సంప్రదించగా మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత్ రావు ,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ కోలన్ హనుమంత్ రెడ్డి తో కలిసి పరిశీలించి వెంటనే అక్రమ కట్టడాలను కూల్చివేయించిన టి‌పి‌సి‌సి ప్రధాన కార్యదర్శి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి .

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత పదేళ్లుగా బి‌ఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అనేక చెరువులు,కుంటలను నామరూపాలు లేకుండా చేసి ఎన్నో కాలనీలను నీట మునిగేలా చేశారని,కాంగ్రెస్ ప్రజాపాలనలో నేడు ప్రతి చెరువును,కుంటను కాపాడి ప్రజలకు వరద ముంపు లేకుండా చూస్తూ భూగర్భ వనరులను కాపాడే బాధ్యత తీసుకుంటుందని స్పష్టం చేశారు.
చెరువులు కుంటలను కబ్జాలు చేసేవారు ఎంతటివారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో కొంపల్లి మున్సిపాలిటీ అధ్యక్షులు బైరి ప్రశాంత్ గౌడ్,కొంపల్లి మాజీ సప్రఞ్చ్ జిమ్మి దేవేందర్,దూలపల్లి కౌన్సిలర్ శివ కుమార్ గౌడ్,పి‌ఏ‌సి‌ఎస్ ఛైర్మన్ నరేందర్ రాజు, పి‌ఏ‌సి‌ఎస్ డైరెక్టర్ డప్పు నరేందర్, మరియు దూలపల్లి గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

WhatsApp Image 2024 06 08 at 16.06.45

SAKSHITHA NEWS