SAKSHITHA NEWS

మేడ్చల్ – మల్కాజ్ గిరి జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్ కాంప్లెక్స్) సమావేశ మందిరంలో జరిగిన జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ ( దిశ) సమావేశంలో చైర్మన్ , మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ , ఎమ్మెల్యే లు ఎమ్మెల్యేలు బండారి లక్ష్మారెడ్డి , KP వివేకానంద గౌడ్ , మర్రి రాజశేఖర్ రెడ్డి , జిల్లా కలెక్టర్ గౌతమ్ పోట్రు మరియు ఇతర అధికారులతో కలిసి పాల్గొన్న PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ ( దిశ) సమావేశం నిర్వహించుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా పరిధిలోని శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని కూకట్పల్లి(పార్ట్) ,వివేకానంద నగర్, హైదర్ నగర్ ,ఆల్విన్ కాలనీ డివిజన్ల అభివృద్ధికి సహకరించాలని , ఆయా డివిజన్ల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో అన్ని రకాల మెరుగైన మౌలిక వసతులు కల్పించాలని, విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైన విద్యను అందెచేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.

ప్రభుత్వ పాఠశాలలను ప్రభుత్వ నిధులు, CSR నిధులతో అభివృద్ధి చేయాలని

మైనింగ్ మినరల్ నిధులు మంజూరు చేసి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.

ప్రభుత్వ భూములను పరిరక్షించాలని, సర్వే నెంబర్ 336 లో అన్యాక్రాంతం అవుతున్న ప్రభుత్వ భూమి ని కాపాడి ప్రజలకు ఉపయోగపడేలా చూడలని, కబ్జాదారుల పై కఠిన చర్యలు తీసుకోవాలని , ప్రభుత్వ భూమి ని పరిరక్షించి ప్రజా అవసరాలకు ఊపయోగ పడేలా చూడలని ,ప్రభుత్వ ఆసుపత్రి, గ్రంథాలయం మరియు ప్రభుత్వ పాఠశాలలు నిర్మించుకోవడానికి సహకరించాలని, ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత మనఅందరి పై ఉంది అని PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ తెలియచేసారు


SAKSHITHA NEWS