SAKSHITHA NEWS

మానసిక ప్రశాంతత తోనే సంపూర్ణ ఆరోగ్యం……………….
వి రజని లోక్ అదాలత్ జిల్లా కార్యదర్శి

సాక్షిత వనపర్తి
మానసిక ప్రశాంతత తోనే సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని వనపర్తిజిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి రజిని అన్నారు.గురువారం జిల్లా కేంద్రంలోని కోర్టు ప్రాంగణంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకొని అవగాహన సదస్సు జరిగింది .ఈ సదస్సు గురించి ఆమె మాట్లాడారు సమాజంలోని ప్రజలు ప్రశాంతత జీవనం గడిపేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు సూచించిన మార్గాన్ని అవలంబించాలని చెప్పారు . ఈ సందర్భంగా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు మోహన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ వివిధ అంశాలపై లోక్ అదాలత్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే అవగాహన సదస్సును స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని వివరించారు .ప్రజలు చైతన్యమై అవగాహన పెంచుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా జూనియర్ సివిల్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి బి. రవికుమార్ మాట్లాడుతూ చట్టాలను ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉంటే ఇతరులకు వీటి పట్ల ఆసక్తి పెంచాలని సూచించారు సాధించాలన్న తపన ఉంటే ఏదైనా సాధించవచ్చు అన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఆసుపత్రి మానసిక వైద్యురాలు పుష్పలత మాట్లాడుతూ ప్రతినిత్యం వివిధ పనుల్లో ఉండే మనం మానసిక ఒత్తిడికి గురి కాకూడదని చెప్పారు శారరికా శ్రమ, వ్యాయామం, నడక వంటి అలవర్చుకుంటే కొంత వరకు ఒత్తిడిని తట్టుకునే అవకాశం ఉందన్నారు. సంపూర్ణ ఆరోగ్యానికి కావలసిన సరిపడా నిద్ర, పౌష్టికాహారం, ప్రధానమని వివరించారు. ఆలోచనలను ,భయ ఆందోళనలను అదుపులో పెట్టుకోవాలని, చేస్తున్న పనుల్లో సంతృప్తి పొందాలని, అనాలోచిత విధానాలను విడనాడాలని తద్వారా సమతుల్య ఆరోగ్యం అలవబడుతుంది అన్నారు. మానసిక ఇబ్బందులతో ఉండే వారికోసం ప్రభుత్వం వారికి అవసరమయ్యే సూచనలను సలహాలను ఇచ్చేందుకు ప్రత్యేకంగా14416 టోల్ ఫ్రీ నెంబర్ ప్రవేశపెట్టింది అన్నారు .24 గంటలు అందుబాటులో ఉండే ఈ నెంబర్ అవసరమైన వారు సంప్రదించి వినియోగించుకోవాలని సూచించారు .ఈ సదస్సులో న్యాయమూర్తులు బి.రవి కుమార్, వై .రజిని న్యాయవాదుల సంఘం అధ్యక్షులు మోహన్ కుమార్ యాదవ్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ప్రోగ్రాం అధికారులు శ్రీనివాసులు ,మల్లేష్, న్యాయవాదుల కోర్టు సిబ్బంది ,లోక్ అదాలత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS