
ప్రజావాణి లో బాగంగా బాదితుల నుండి ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ టి శ్రీనివాస రావు ఐపిఎస్
ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎలాంటి పైరవీలు లేకుండా స్వచ్చందంగా పోలీసు సేవల్ని వినియోగించుకుంటూ, వారి ఫిర్యాదుల పై చట్ట ప్రకారం చర్యలు తీసుకునేల పోలీస్ శాఖ కృషి చేస్తుందని జిల్లా ఎస్పీ శ్రీ టి శ్రీనివాస రావు ఐపీఎస్ అన్నారు.
ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఈ రోజు జిల్లా లోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన బాదితుల నుండి జిల్లా ఎస్పీ 7 ఫిర్యాదులను గద్వాల్ ,ఆలంపూర్,మరియు శాంతి నగర్ సీఐ ల సమక్షంలో స్వీకరించారు.
పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఫిర్యాదుల పై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో సీఐ లను అడిగి వాటిని పరిష్కరించేందుకు తగు సూచనలు చేసి వాటి నీ చట్టా ప్రకారం పరిష్కరించాలని సంబంధిత ఎస్సై లకు ఫోన్ చేసి ఆదేశించారు.
ఈ సందర్బంగా ఎస్పి మాట్లాడుతూ. —–ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎలాంటి పైరవీలు లేకుండా స్వచ్చందంగా పోలీసు సేవల్ని వినియోగించుకుంటూ, వారి సమస్యలు చట్ట ప్రకారం పరిష్కరించుకునేల పోలీస్ యంత్రాంగం కృషి చేస్తుందని, శాంతి భద్రతలు పరిరక్షిస్తూనే ప్రజలకు అన్ని వేళల అందుబాటులో ఉంటూ కమ్యూనిటీ, ఇతర అవగాహాన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు మరింత దగ్గరయ్యేల కృషి చెయ్యడం జరుగుతుందని అన్నారు. ప్రజా సమస్యల పై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా నేరుగా పిర్యాదులు స్వీకరించి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ అన్నారు.
ఈ రోజు వచ్చిన ఫిర్యాదుల లో భూ వివాదాలకు సంబంధించి -04 పిర్యాదులు.
ప్లాట్ ఆక్రమణకు సంబందించి -01
ఇతర అంశాలకు సంబంధించి -02
పిర్యాదులు రావడం జరిగింది.
జిల్లా పోలీస్ కార్యాలయం
జోగుళాంబ గద్వాల్ జిల్లా

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app