సంచార లోక్ అదాలత్ వాహన సేవలను వినియోగించుకోవాలి………..జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి , సీనియర్ సివిల్ జడ్జ్ కళార్చన
సాక్షిత వనపర్తి
సంచార లోక్ అదాలత్ వాహనం యొక్క సేవలను వినియోగించుకోవాలని జిల్లా న్యాయ సేవధికార సంస్థ కార్యదర్శి అన్నారు. జిల్లా న్యాయ సేవధికార సంస్థ ఆధ్వర్యంలో చిట్యాల గ్రామ ప్రజలకు చట్టాలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కార్యదర్శి మాట్లాడుతూ కక్షిదారులు కేసులను రాజీ పడడం వలన సమయం మరియు డబ్బును ఆదా చేసుకోవచ్చని తెలియజేశారు. రాజీమార్గం ఎంచుకున్న కక్షిదారులు జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదిస్తే సంచార లోకదాలత్ వాహనం ద్వారా వారి గ్రామాలకే చేరుకొని కేసులను పరిష్కరిస్తామని తెలిపారు.
వాహనంలో ఏర్పరిచిన ప్రత్యేక తెరపై లఘు చిత్రాలను ప్రదర్శించి ప్రజలకు చట్టాలపై సులభంగా అవగాహన కల్పించారు. అదేవిధంగా బాల్యవివాల నిర్మూలన చట్టం, బాల కార్మికుల నిర్మూలన చట్టం, డ్రగ్ అబ్యూస్ మరియు సైబర్ క్రైమ్స్ మీద అవగాహన కల్పించారు. మరియు చిట్యాల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో లీగల్ ఎయిడ్ కౌన్సిల్స్ కృష్ణయ్య, రఘు, శ్రీదేవి, సబ్ ఇన్స్పెక్టర్ హృషికేస్, గ్రామ సర్పంచ్, గ్రామపంచాయతీ కార్యదర్శి, ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్లు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
