క్షేత్రస్థాయిలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన కమిషనర్ ఎన్.మౌర్య
నగరపాలక సంస్థ పరిధిలోని మూడవ వార్డు పోస్టల్ కాలనిలో ప్రజల ఫిర్యాదులను బుధవారం ఉదయం కమిషనర్ ఎన్.మౌర్య క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చే సమస్యలను కమిషనర్ అధికారులతో కలసి పరిశీలిస్తున్నారు.
ఈ మేరకు ఉదయం పోస్టల్ కాలని లో రోడ్లు, డ్రెయినేజీ కాలువలను పరిశీలించారు. పారిశుద్ధ్య పనులు మెరుగ్గా చేపట్టాలని అన్నారు. అలాగే అభివృద్ధి పనులకు అంచనాలు సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే డ్రెయినేజీ కాలువల్లో ఎప్పటికప్పుడు మురుగు, చెత్త తొలగించి మురుగునీరు సజావుగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు, కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్ తులసి కుమార్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డి.ఈ.రమణ, ఏసిపి బాలాజి, సర్వేయర్ కోటేశ్వర రావు, శానిటరీ సూపర్ వైజర్ సుమతి, తదితరులు ఉన్నారు.