![](https://sakshithanews.com/wp-content/uploads/2025/01/WhatsApp-Image-2025-01-29-at-19.11.05.jpeg)
మోపాడు రిజర్వాయర్ ను సందర్శించిన కలెక్టర్ తమీమ్ అన్సారియ, ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర
కనిగిరి సాక్షిత
కనిగిరి నియోజకవర్గం పామూరు మండలంలోని ఆయకట్టు రైతులకు వరప్రసాదిని మోపాడు రిజర్వాయర్ ను ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియ, ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ తమీమ్ అన్సారియ రిజర్వాయర్ నీటి సామర్థ్యం, సాగు చేస్తున్న పంట పొలాల విస్తీర్ణం గురించి ఇరిగేషన్, రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి రిజర్వాయర్ కు సంబంధించిన తూముల,కాలువల మరమ్మత్తు పనులు, చేపట్టవలసిన అభివృద్ధి గురించి కలెక్టర్ తమీమ్ అన్సారియ కు వివరించారు. ఈ కార్యక్రమంలో మోపాడు రిజర్వాయర్ సూపర్ చైర్మన్ చుంచు కొండయ్య, వైస్ చైర్మన్ మోరు బోయిన నరసింహారావు యాదవ్, టిడిపి మండల పార్టీ అధ్యక్షులు పువ్వాడి వెంకటేశ్వర్లు, టిడిపి నాయకులు యారవ శ్రీనివాసులు, అడుసుమల్లి ప్రభాకర్ చౌదరి యారవ ప్రసాద్ రెడ్డి ,గిడ్డయ్య యాదవ్, మెంటా నరసింహారావు,మట్లె రాహుల్ యాదవ్ తదితర టిడిపి నాయకులు, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
![](https://sakshithanews.com/wp-content/uploads/2025/01/WhatsApp-Image-2025-01-29-at-19.11.05.jpeg)
https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app