SAKSHITHA NEWS

గడువు లోపు రీ సర్వే పూర్తి చేయాలి – కలెక్టర్ అరుణ్ బాబు

పల్నాడుభూముల రీ సర్వే ప్రక్రియను గడువు లోపు పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ అరుణ్ బాబు ఆదేశించారు. నకరికల్లు మండలం కండ్లకుంటలో బుధవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో చేపడుతున్న భూముల రే సర్వే ప్రక్రియను తనిఖీ చేశారు. భూములు రిసర్వే ప్రక్రియను గడువు లోపల పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైతులతో మాట్లాడుతూ భూములు రీ సర్వే ప్రక్రియ వల్ల సమస్యలు ఏమైనా ఉన్నాయా, సక్రమంగా కొలతలు వస్తున్నాయా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏమన్నా ఉత్పన్నమైతే సంబంధిత అధికారులను కలిసి పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారిణి మధు కీర్తి, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

పదవతరగతి పరీక్ష కేంద్రం పరిశీలన

నకరికల్లులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న పదవ తరగతి పరీక్షా సరళిని పరిశీలించారు. విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేశారా? త్రాగునీరు, ప్రాథమిక చికిత్స కేంద్రం తదితరములు ఉన్నాయా లేదా అని సంబంధిత సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అక్కడ సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారిని చంద్రకళ, హై స్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app