చెరువుల చుట్టూ ఆర్థిక కార్యకలాపాలు పెంచాలి: సీఎం రేవంత్ రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాతబస్తీలో పునరుద్ధరించిన రుక్న్-ఉద్-దౌలా చెరువును ప్రారంభించారు. చెరువులు మహిళలకు ఆదాయ వనరులుగా మారాలని, వాటి చుట్టూ ఆర్థిక కార్యకలాపాలు అభివృద్ధి చెందాలని ఆయన తెలిపారు.
గండిపేట నుంచి గౌరెల్లి వరకు మూసీ నది ఇరువైపులా నైట్ బజార్లు ఏర్పాటు చేసి స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది.
హైడ్రా ఆక్రమణలను తొలగించి చెరువును విస్తరించి, వాకింగ్ పాత్‌లు, ఓపెన్ జిమ్‌లు, పిల్లల ఆట స్థలాలతో ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY