కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ గ్రామంలో గల శ్రీశ్రీశ్రీ గొల్ల కేతమ్మ బేలిజ మేడల్లమ్మ వారి సమేత మల్లికార్జున స్వామి వారి కల్యాణం జాతర మహోత్సవం ఎంతో భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమానికి ఆలయ కమిటీ అధ్యక్షులు జెక్కుల మల్లేష్ యాదవ్ ఆహ్వానం మేరకు ముఖ్య అతిథులుగా
డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రేశ్ యాదవ్ మరియు
నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి,
నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు.
ఈ కార్యక్రమం లో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గ్రంధాలయ చైర్మన్ బొంగునూరి శ్రీనివాస్, ముత్యం రెడ్డి,కావాలి గణేష్,బొట్ల విజయ్ కుమార్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు సిద్దనోల సంజీవరెడ్డి, మైసిగారి శ్రీనివాస్, పరశురాం గౌడ్, ధర్మారెడ్డి,తదితరులు పాల్గొన్నారు

