SAKSHITHA NEWS

సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి!

హైదరాబాద్:జనవరి 17
తెలంగాణకు భారీగా పెట్టు బడులను సమీకరించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, సింగపూర్‌, దావోస్‌ పర్యటనకు బయలుదేరి వెళ్లారు.

ఆరు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా గురువారం రాత్రి ఆయన ఢిల్లీ నుంచి సింగపూర్‌ వెళ్లారు. అక్కడ ఆ దేశ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్,తో ఈరోజు భేటీ అయ్యారు. గ్రీన్ ఎనర్జీ మూసీ పునరుజ్జివనం పర్యాటకం,విద్య,ఐటీ నైపుణ్యాల నిర్మాణంపై చర్చించారు.

మూడు రోజుల పర్యటన అనంతరం దావోస్‌ వెళ్తారు. ఐటీ, పరిశ్రమల శాఖ మం త్రి శ్రీధర్‌ బాబు, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు ఈ పర్యటనలో సీఎం రేవంత్‌ వెంట ఉంటారు.

శుక్ర, శని, ఆదివారాల్లో సీఎం, మంత్రి, అధికారులు సింగపూర్‌లో పర్యటిస్తారు. రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి వివిధ కంపె నీల ప్రతినిధులతో సంప్రదిం పులు జరుపుతారు.

ఈ సందర్భంగా ప్రపంచంలో పేరొందిన సింగపూర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ను సందర్శి స్తారు. నైపుణ్యాభివృద్ధికి ఆ యూనివర్సిటీ ఎంచుకున్న కోర్సులు, అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేస్తారు.

రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివ ర్సిటీకి సహకారం అందిం చేందుకు సింగపూర్‌ ఐటీఈతో ఒప్పందం చేసు కుంటారు. సింగపూర్‌లో రివర్‌ ఫ్రంట్‌ను సందర్శిస్తారు.