SAKSHITHA NEWS

మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి!

హైదరాబాద్:
తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి,ఇవాళ, రేపు రెండు రోజుల పాటు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఇవాళ హైదరాబాద్​ నుంచి ఉదయం 10 గంటలకు నాగ్‌పూర్‌ కు బయలుదేరి వెళ్లారు.

అక్కడ చంద్రాపూర్​ లో నేతలతో కలిసి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం వరుసగా రాజురా, డిగ్రాస్, వార్దా​ నియోజకవర్గాల్లో ప్రచార సభలు, రోడ్ షోలలో పాల్గొని రాత్రికి తిరిగి నాగ్‌పూర్‌​ చేరుకుంటారు. అక్కడే బస చేస్తారు.

ఇక రెండోరోజు ఆదివారం ఉదయం నాగ్‌పూర్‌ నుంచి నాందేడ్‌ చేరుకుంటారు. నయగావ్, భోకర్​​, షోలాపూర్​ నియోజక వర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ప్రచారం అనంతరం అక్కడి నుంచి మళ్లీ హైదరాబాద్‌ కు తిరిగి రానున్నట్లు తెలుస్తుంది.

ఈ నెల 20న జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మహాయుతి, ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటమి మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది.

ఈ నేపధ్యంలో అధికార ఎన్డీయే కూటమి, విపక్ష ఇండియా కూటమి గెలుపు కోసం శతవిధాలా ప్రయత్ని స్తున్నాయి.కాంగ్రెస్ తరపున ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కర్ణాటక సీఎం సిద్ధరామ య్య, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తదితరులు ప్రచారం చేస్తున్నారు.

ఎన్డీయే కూటమి తరపున ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రచారం చేస్తున్నారు.

తెలుగువారు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌కు చెందిన రాష్ట్ర మంత్రులు, ఎంపీలు ప్రచారంలో పాల్గొనున్నారు..


SAKSHITHA NEWS