SAKSHITHA NEWS

కురుమూర్తి కి రానున్న సీఎం రేవంత్ రెడ్డి

ఏర్పాట్లను పరిశీలించిన దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి

సాక్షిత వనపర్తి
వనపర్తి జిల్లా
దేవరకద్ర నియోజకవర్గం : కురుమూర్తి స్వామి దేవస్థానానికి ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచేస్తున్న సందర్భంగా జాతర లో జరుగుతున్న ఏర్పాట్లను సంబంధిత అధికారులతో చర్చించి, సీఎం రాక సందర్భంగా రూట్ మాప్, భద్రత ఏర్పాట్లపై DIG తో చర్చించి అనంతరం హెలిప్యాడ్ వద్ద జరుగుతున్న ఏర్పాట్లను దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి . పరిశీలించారు

అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవం కురుమూర్తి స్వామి దర్శనానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు 10వ తేదీ ఆదివారం ఉదయం 10:00 గంటలకు విచ్చేసి, ఎలివేటేడ్ కారిడార్ తో కూడిన ఘాట్ రోడ్ నిర్మాణానికి మరియు దేవాలయం కు సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి అనంతరం స్వామి వారిని దర్శించుకుంటారని తెలియజేశారు.

సీఎం రాక సందర్భంగా ఎలాంటి అంక్షలు లేవని, భక్తులు యధావిధిగా స్వామి వారిని దర్శించుకోవచ్చని, షాప్స్ అన్ని తెరుచుకుని ఉంటాయని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు, సీఎం విచేస్తున్న సందర్భంగా పాలమూరు జిల్లా ప్రజానీకం, కురుమూర్తి స్వామి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు..


SAKSHITHA NEWS