సీఎం రిలీఫ్ ఫండ్స్ చెక్స్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే బీర్ల
తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలనకు కొత్త అర్థం తీసుకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, నాయకత్వంలో ప్రతి సంక్షేమ పథకాన్ని పారదర్శకంగా ప్రజలకు అందిస్తోంది. మధ్యవర్తులు, పైరవీలు, కమిషన్లకు తావులేకుండా అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ సహాయం నేరుగా అందేలా చర్యలు కొనసాగుతున్నాయి.
పెన్షన్, రేషన్ కార్డు, సీఎం రిలీఫ్ ఫండ్, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాల కోసం ఎవరైనా డబ్బులు అడిగినా, కిరాయిల పేరుతో ఇబ్బంది పెట్టినా వెంటనే అధికారులకు లేదా ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
“ఇది ప్రజల ప్రభుత్వం…
మీ హక్కు మీ చేతికే చేరే ప్రభుత్వం.
లక్షల రూపాయల సహాయం అందిస్తున్న ప్రభుత్వం, మధ్యలో ఎవరికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు.
ప్రజల కష్టాలు తెలుసుకుని సేవ చేయడమే మా లక్ష్యం” అని పేర్కొన్నారు.
ప్రతి పేద కుటుంబానికి అండగా నిలుస్తూ, పారదర్శక పాలనతో ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడమే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
