అమరావతి : కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు ప్రసంగం : ప్రభుత్వ విధానాల చర్చకు కలెక్టర్ల సదస్సు ఉపయోగపడుతుంది – ప్రతి సంక్షోభంలో అవకాశాలు ఉంటాయి – సంక్షోభంలో అవకాశాలు సృష్టించుకోవడమే నాయకత్వం – ప్రజా చైతన్యమే ప్రజాస్వామ్యానికి శ్రీరామరక్ష – ప్రయత్నాలు చేసిన వెంటనే ఫలితాలు రావు – నిరంతరం ప్రయత్నిస్తుంటేనే ఫలితాలు – విశాఖలో గూగుల్ కంపెనీ ఏర్పాటుకు ఎంవోయూ కుదిరింది – లోకేష్ కృషి వల్ల గూగుల్ ఏర్పాటుకు ఎంవోయూ – గూగుల్ తో ఎంవోయూ వల్ల విశాఖలో అధిక అభివృద్ధి – హార్డ్ వర్క్ ముఖ్యం కాదు.. స్మార్ట్ వర్క్ కావాలి – తప్పు చేసినవాడిని ఎట్టి పరిస్థితుల్లో చట్ట ప్రకారం శిక్షించాలి – గత ఐదేళ్లు రాష్ట్ర బ్రాండ్ దెబ్బతింది – విశ్వాసం ఉంటే పెట్టుబడులు వస్తాయి.. అభివృద్ధి చెందుతాం – ప్రభుత్వంలో స్పీడ్ ఆఫ్ బిజినెస్ ఉంటేనే పెట్టుబడులు వస్తాయి – గతంలో ఎన్నడూ లేని ఇబ్బందులు చూస్తున్నాం – రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్ల బకాయిలు ఉన్నాయి – ఇంకా రూ. లక్ష కోట్ల బిల్లులు చెల్లించాలి – ఎక్కడ నేరం జరిగినా దాని వెనుక గంజాయి బ్యాచ్ ఉంది – రేషన్ బియ్యం మాఫియాను పెకలించాలి – మూడు నెలల్లో రేషన్ బియ్యం మాఫియాను అణచివేయాలి – పోర్టులు, సెజ్ లను సైతం గతంలో కబ్జా చేశారు –
గతంలో కేంద్ర ప్రభుత్వ నిధులనూ దారి మళ్లించారు – నూతనంగా 20 విధానాలను తీసుకొచ్చాం – 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా కృషి – అమరావతి కోసం ఇప్పటికే రూ.31 వేల కోట్లు సేకరించాం – 2027 లోపు పోలవరం పూర్తి చేయాలని నిర్ణయించాం – ఎట్టి పరిస్థితుల్లో పోలవరం 2027లోపు పూర్తవుతుంది – మూణ్నెళ్లకు కలిపి ఒకేసారి పింఛన్ ఇచ్చేలా విధానం తెచ్చాం – దేశంలో ఎక్కువ పింఛన్ ఇచ్చే రాష్ట్రం ఏపీనే – ఇతర రాష్ట్రాల్లో మనం ఇస్తున్న పింఛన్ లో సగం కూడా ఇవ్వలేదు – దీపం-2 కింద ఇప్పటికే 40 లక్షల మందికి ఉచిత గ్యాస్ సిలిండర్లు – వచ్చే ఏడాది స్కూళ్ల ప్రారంభం నాటికి టీచర్ పోస్టుల భర్తీ – 60 శాతానికి పైగా భూ సమస్యల ఫిర్యాదులు వస్తున్నాయి – రెవెన్యూ సదస్సులను నామమాత్రంగా పరిష్కరిస్తే కుదరదు – 90 శాతం సమస్యలు ఐదారు శాఖల్లోనే ఉన్నాయి – సంక్రాతి నాటికి ఆర్ అండ్ బీ రోడ్లపై గుంతలు ఉండకూడదు : సీఎం చంద్రబాబు