ఇకనుంచి 3 నెలలకు ఒకసారి పెన్షన్ తీసుకోవచ్చు: సీఎం చంద్రబాబు
ఏపీలో పెన్షన్లు తీసుకునే లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు నాయుడు శుభవార్త అందించారు.
పెన్షన్ మొత్తాన్ని 3 నెలలకోసారి తీసుకోవచ్చని వెల్లడించారు. పెన్షన్ ఎవరు ఆపినా వెంటనే నిలదీయాలని లబ్ధిదారులకు పిలుపు నిచ్చారు.
పెన్షన్ తీసుకోవడం ప్రజల హక్కని, పింఛను డబ్బును ఇంటి వద్దే గౌరవంగా ఇచ్చేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు.
64 లక్షల మందికి ప్రభుత్వం పెన్షన్లు అందిస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు.