
ఆర్థిక భరోసానిచ్చేది సీఎం సహాయనిధి : బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …
125 – గాజుల రామారం డివిజన్ ఇందిరా నగర్ ప్రాంతానికి చెందిన అల్లుకుటూర్ విజయ్ కుమార్ తండ్రి అల్లుకుటూర్ ముత్తు స్వామి (58) ఆరోగ్య పరిస్థితిపై కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ని ఆశ్రయించగా వారి ఆర్థిక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితిపై చలించిన ఎమ్మెల్యే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అల్లుకుటూర్ విజయ్ కుమార్ తండ్రి అల్లుకుటూర్ ముత్తు (2,00,000/-) కి ఎల్ఓసీ మంజూరు చేయించగా పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ లబ్ధిదారునికి ఎల్ఓసీ చెక్కును పంపిణీ చేశారు.
ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ…..ఆపదలో ఉన్న నిరుపేదలకు ఆర్థిక భద్రతనిచ్చేది, ఆరోగ్య భరోసానిచ్చేది ముఖ్యమంత్రి సహాయనిధి అని అన్నారు.
ఈ కార్యక్రమంలో జగద్గిరిగుట్ట డివిజన్ అధ్యక్షులు రుద్ర అశోక్, కుత్బుల్లాపూర్ డివిజన్ ప్రధాన కార్యదర్శి సత్తిరెడ్డి, నాయకులు ఎర్వ సాయికిరణ్, ఇమ్రాన్ బేగ్ తదితరులు పాల్గొన్నారు.
