తుఫాను నేపథ్యంలో
ప్రధాన డ్రైన్లలో పూడికలు తొలగింపు…
జోరు వానలో పనులు పరిశీలించిన
శానిటరీ ఇనస్పెక్టర్ సిహెచ్ రమణారావు
చిలకలూరిపేట మొంథా తుఫాన్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ పీ శ్రీహరిబాబు ఆదేశాల మేరకు,మంగళవారం నాడు శానిటరీ ఇనస్పెక్టర్ సిహెచ్ రమణారావు జోరువానలో సైతం వర్షపు నీరు నిల్వ ఉండకుండా ఉండేందుకు గడియారస్థభం సెంటర్, కే బి.రోడ్డు లో ఉన్న ప్రధాన డ్రైన్లను జెసిబి తో పూడికలు తొలగింపుల కార్యక్రమం నిర్వహించారు. అనంతరం డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాలను పరిశీలించారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మెన్ షేక్ రఫానీ సూచనల మేరకు కోమల విలాస సెంటర్. మెయిన్ రోడ్డు. శారద హైస్కూల్ రోడ్డు తదితర ప్రాంతాల్లో మురుగు కాల్వలను పరిశీలించి వర్షపు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
