SAKSHITHA NEWS

పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత: డిప్యూటీ మేయర్

కుత్బుల్లాపూర్ నియోజిక వర్గం నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ వజ్ర పుష్పక్ రోడ్ లో పారిశుద్ధ్య నిర్వహణలో ప్రతి కూరగాయల మార్కెట్ నిర్వహణ వలన పేరుకుపోయిన వ్యర్థాలను పారిశుద్ధ్య కార్మికులకు చెప్పి తొలగించారు.డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత మన అందరి బాధ్యత అని, మన చుట్టు ప్రక్కన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటేనే మనం ఆరోగ్యంగా ఉంటామని,ఎప్పటికప్పుడు మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేస్తూ,కార్పొరేషన్ పరిధిలో రోడ్లు,పరిసరాలు,వివిధ సముదాయాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని శానిటేషన్ సుపర్వైజర్లకు,సిబ్బందికి సూచించారు. అదే విధంగా స్థానిక ప్రజలు నెలకొన్న రోడ్ ప్యాచ్ వర్క్ పనులు వంటి పలు సమస్యలు వివరించగా వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కుమార్ రెడ్డి, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ సుకృత రెడ్డి, సైట్ ఇంజనీర్ అరుణ్, ఫీల్డ్ ఇంజినర్ శివ, సూపర్వైజర్లు సురేష్, దశరథ్, సురేఖ, నర్సింగ్ రావు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS