బాధ్యతలు స్వీకరించిన సీఐ పాపారావు
ప్రకాశం జిల్లా
త్రిపురాంతకం సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బి. పాపారావు బుధవారం బాధ్యతలు చేపట్టారు.ఈనెల తొమ్మిదో తారీఖున పలువురు సీఐలకు స్థానచలనం కల్పిస్తూ గుంటూరు రేంజ్ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ చేశారు. అందులో భాగంగా ఇక్కడ పనిచేస్తున్న సీఐ రాంబాబు ను గుంటూరు రేంజ్ కార్యాలయం కు పంపడంతో ఆ స్థానంలో పాపారావు ను నియమించారు. ఈ సందర్భంగా సర్కిల్ కార్యాలయానికి చేరుకున్న ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ శాంతి భద్రతల విషయంలో రాజీలేకుండా పనిచేస్తానన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టిసారిస్తామన్నారు. బాధ్యతలు స్వీకరించిన సీఐ పాపారావుకు ఎస్సై వెంకట సైదులు పలువురు పోలీస్ సిబ్బంది అభినందనలు తెలిపారు.
బాధ్యతలు స్వీకరించిన సీఐ పాపారావు
Related Posts
టొయోటాను ఆదరించాలి.
SAKSHITHA NEWS టొయోటాను ఆదరించాలి.పెద్దపాడులో మోడి టొయోటా గ్రామీణ మహోత్సవంప్రారంభించిన ఎమ్మెల్యే గొండు శంకర్శ్రీకాకుళంటొయోటా కార్లు అన్ని వర్గాల ప్రజలకు తక్కువ ధరకు అందిస్తూ నాణ్యతలో మంచి ప్రమాణాలు పాటిస్తున్నాయని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొన్నారు. మండలంలోని పెద్దపాడులోని రామిగెడ్డ…
విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ ఒక చరిత్ర: సీఎం చంద్రబాబు
SAKSHITHA NEWS విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ ఒక చరిత్ర: సీఎం చంద్రబాబు విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ ఒక చరిత్ర: సీఎం చంద్రబాబుఆంధ్రప్రదేశ్ : స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ విడుదల ఒక చరిత్ర అని సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ…