సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలకు అవగాహన కల్పించిన………. ఒకటో వార్డు కౌన్సిలర్ చుక్క జయశ్రీ రాజు
సాక్షిత వనపర్తి
వనపర్తి
మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించే డ్రై డే, ఫ్రైడే కార్యక్రమంలో భాగంగా ఒకటో వార్డులో మున్సిపల్ సిబ్బందితో కలిసి ఆ వార్డ్ కౌన్సిలర్ చుక్క జయశ్రీ రాజు వార్డు ప్రజలకు ఇండ్ల చుట్టూ పెరిగిన పిచ్చి మొక్కలు నీటీ హౌస్ ల్లో డ్రమ్ముల్లో కుండల్లో చాలా రోజులుగా నిల్వ ఉన్న నీటిని తొలగించి శుభ్రంగా ఉన్న నీటిని నింపుకొని మూతలు పెట్టుకోవాలని చేసి వార్డు ప్రజలకు చూపిస్తూ ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉన్న నీటిని నింపుకోవాలని వాటిపై మూతలు పెట్టుకోవాలని లేదంటే కలుషిత మైన ఆహారం నీరు వీటి పై ఈగలు దోమలు వాలి వాటి ద్వారా వాంతులు విరేచనాలు పచ్చకామెర్లు వంటి వ్యాధులు వస్తాయని అలాగే దోమల ద్వారా డెంగ్యూ మలేరియా చికెన్ గున్యా పైలేరియా మెదడు వాపు లాంటి అనేక రకాలైన అంటూ వ్యాధులు వస్తాయని మున్సిపాలిటీ సిబ్బందితో కలిసి ప్రజలకు అవగాహన కల్పిస్తూ ముందు జాగ్రత్త గా నీటిని వేడి చేసి చల్లార్చుకుని తాగాలని వేడి వేడిగా ఉన్న పదార్థాలను తినాలని వివరించారు ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
