SAKSHITHA NEWS

Christ’s teachings to love everyone, walk the path of peace, and be of service are applicable to all mankind – Minister Puvvada.

అందరినీ ప్రేమించాలి, శాంతి మార్గంలో నడవాలి, సేవాభావంతో మెలగాలి అన్న క్రీస్తు బోధనలు సర్వమానవాళికి ఆచరణీయం-మంత్రి పువ్వాడ.

క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

అందరినీ ప్రేమించాలి, శాంతి మార్గంలో నడవాలి, సేవాభావంతో మెలగాలి అన్న క్రీస్తు బోధనలు సర్వమానవాళికి ఆచరణీయమని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.

క్రిస్మస్ వేడుకల్లో భాగంగా ఖమ్మం చర్చ్ కాంపౌండ్ సి ఎస్ ఐ చర్చ్ నందు జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హాజరైయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ముందుగా రాష్ట్ర ప్రజలకు, క్రైస్తవ సోదర, సోదరీమణులకు మంత్రి పువ్వాడ క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమా భావాన్ని, సేవాతత్పరతను , క్షమా గుణాన్నీ బోధించిన క్రీస్తు జన్మదినం క్రైస్తవులకు అత్యంత సంతోషకరమైన రోజు అని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా జరుపుకునేది క్రిస్మస్ పండుగ ఒక్కటే అని, క్రిస్మస్ పండుగ ను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించడం దేశంలో ఎక్కడ లేదని తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఉందన్నారు.

ఈ పర్వదినం సందర్భంగా రాష్ట్రంలోని పేద క్రిస్టియన్లకు ప్రభుత్వం కానుకగా బట్టలు పంపిణీ చేస్తున్నదని తెలిపారు. కుటుంబ సమేతంగా సుఖసంతోషాలతో క్రిస్మస్ వేడుక జరుపుకోవాలని ఆకాంక్షించారు. యేసు క్రీస్తు దీవెనలు ప్రతి ఒక్కరికీ లభించాలని, అందరూ సంతోషంగా జీవించాలని ప్రార్థించారు. అన్ని మతాల సారం మానవత్వమే, అన్ని మతాలకు దేవుడు ఒక్కడే అన్న ఏసుక్రీస్తు ప్రభోదం మేరకు గౌరవ ముఖ్యమంత్రి కేసిఆర్ తెలంగాణ రాష్ట్రం వచ్చాక అన్ని మతాలను సమాన దృష్టితో చూస్తూ అన్ని మతాల ముఖ్య పండగలను అధికారికంగా నిర్వహిస్తున్నారని తెలిపారు.

క్రిస్మస్ పర్వదినం సందర్భంగా దాదాపు 2 లక్షల 85వేల మంది క్రిస్టియన్ సోదర, సోదరీమణులకు నూతన బట్టలిచ్చి, విందు ఇస్తున్న గొప్ప సంస్కృతిని నెలకొల్పిన ఏకైక ముఖ్యమంత్రి కేసిఆర్ అని అన్నారు. అంతే కాకుండా క్రిస్టియన్ మైనారిటీ సోదరుల ఆత్మగౌరవం పెంపొందించేలా వారికి 2 ఎకరాల స్థలంలో 10 కోట్ల రూపాయలతో క్రిస్టియన్ భవనం నిర్మించడానికి కూడా శంకుస్థాపన చేశారన్నారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా చర్చిల నిర్మాణానికి, మరమ్మత్తులకు, ఆధునీకరణకు, మౌలిక వసతుల ఏర్పాటుకు ప్రభుత్వ నిధులు ఖర్చు పెట్టేందుకు అనుమతినిచ్చిన ఏకైక ప్రభుత్వం కూడా తెలంగాణ అని తెలిపారు.
క్రిస్టియన్ విద్యార్థులు నాణ్యమైన విద్య పొందేందుకు రెసిడెన్షియల్ పాఠశాలల్లో అడ్మిషన్లు ఇస్తున్నారని, విదేశాల్లో విద్య అభ్యసించేందుకు ఓవర్సీస్ స్కాలర్ షిప్ 20 లక్షల రూపాయలు అందిస్తున్నారని తెలిపారు.
క్రిస్టియన్ యువతకు ఉపాధి కల్పించేందుకు డ్రైవర్ ఎంపవర్ మెంట్ కింద 60 శాతం సబ్సిడీతో కార్లను అందిస్తున్నారని, ఉపాధి శిక్షణ ఇస్తున్నారని, 10 లక్షల వరకు సబ్సిడీ అందేలా బ్యాంకు లింకేజీతో రుణాలు కల్పిస్తున్నారని తెలిపారు.
ఇప్పటి వరకు 1718 మందికి 19 కోట్ల రూపాయలను సబ్సిడీగా అందించిందన్నారు. జెరూసలేంకు వెళ్ళే క్రిస్టయన్ భక్తులకు ప్రయాణ వసతులు కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం కూడా తెలంగాణ అన్నారు.

టిఎస్ ప్రైమ్ కింద క్రిస్టియన్ మైనారిటీ యువతను పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తున్నారని, ఐటి పారిశ్రామిక వేత్తల కోసం ఐటి పార్కులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇలా క్రిస్టియన్ మైనారిటీల సర్వతోముఖాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలో కృషి చేస్తోందని, దీనిని క్రిస్టియన్లందరూ గుర్తించి కేసిఆర్ కి మద్దతుగా నిలబడాలని కోరారు. మరోసారి క్రిస్టియన్ సోదర, సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, ఏ ఎం సీ చైర్మన్ లక్ష్మీ ప్రసన్న, చర్చ్ సెక్రటరీ సుధాకర్, కార్పొరేటర్లు బి జీ క్లెమెంట్, పల్లా రోజ్ లీన, కమిటి సభ్యులు ఈ.కిషోర్, పల్లా శేఖర్, తోకల ప్రవీణ్, పల్లా కిషోర్ తదితరులు ఉన్నారు.


SAKSHITHA NEWS