డీవీఎంసీ సమీక్షలో చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాద్
సాక్షిత ప్రతినిధి – చిత్తూరు: జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధ్యక్షతన జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ (డీవీఎంసీ) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్, జిల్లా ఎస్పీ తుషార్ డూడీ, జిల్లా యంత్రాంగం పాల్గొన్నారు. ఇందులో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి పలు సమస్యల పై చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు సుదీర్ఘంగా సమీక్ష జరిపి సూచనలు చేశారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వంలో అట్రాసిటీ చట్టం బాగా అమలు జరుగుతోందని చెప్పారు. అధికారుల సమన్వయంతో ఎస్సీ, ఎస్టీ ల అభివృద్ధికి ప్రాధాన్యం పెరిగిందని ఎంపీ వెల్లడించారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
