వివాదంలో చిక్కుకున్న కందిమల్ల వారి గృహం
చిలకలూరిపేట: మండలంలోని మురికిపూడి గ్రామంలో గల కందిమల్ల తిరుపతి రాయుడు ఇల్లు దాయాధిల మధ్య గొడవల కారణంగా ఆ ఇంటి పై కోర్టులో వివాదం కలదు కోర్టులో కేసు ఉండగానే దౌర్జన్యంగా కందిమల్ల భాస్కర్ బాబు వారి సతీమణి గేటు తాళాలు పగలగొట్టి ఇంటిలో చొరబడి అక్కడే తిష్ట వేసినారు కోర్టు తీర్పు రాకమునిపే ఈ దౌర్జన్యానికి పాల్పడడానికి ఎంతవరకు న్యాయమని బాధితుడు కందిమల్ల తిరుపతి రాయుడు వాపోతున్నారు నా చిన్ననాటి నుండి నా తండ్రి నా తాత ఇచ్చినటువంటి ఇంటిలో నేను నివసించున్నాను ఈ విషయం మురికిపూడి గ్రామంలో ప్రతి ఒక్కరికి తెలిసినదే కేవలం దురుద్దేశంతో కావాలని దౌర్జన్యంగా అక్రమంగా నాపై కక్ష సాధింపు చర్యకు నన్ను ఇబ్బంది పెట్టుటకు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని మీడియాతో మాట్లాడుతూ ఆవేదన చెందారు. గ్రామంలో తెలుగుదేశం కార్యకర్తలు అభిమానులు వారి కుటుంబం ఎప్పటినుండో పార్టీకి సేవలు చేస్తున్నటువంటి వారిపైనే ఇలాంటి చర్యలు జరుగుతుంటే ప్రభుత్వం అధికారంలో ఉండి కూడా ఎందుకు న్యాయం జరగడం లేదు అని గ్రామస్తులు ఆలోచనలో పడ్డారు రాజకీయ ఆర్థిక బలం ఉన్న వ్యక్తికే వారి కుటుంబంలో ఎన్నో ఏళ్లుగా పార్టీకి పనిచేసే వారి ఇంటిలోనే కందిమల్ల బుచ్చయ్య మాజీ ఎమ్మెల్యే, కందిమల్ల జయమ్మ, మాజీ ఎమ్మెల్యే ఇద్దరు ఎమ్మెల్యేలు గా పనిచేసినటువంటి కుటుంబాన్ని ఈ విధంగా ఇబ్బందులు గురి చేస్తుంటే ఇక సామాన్యులు పరిస్థితిని గ్రామస్తులు ఆవేదన వ్యక్తంచేశారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
